ప్రియాంక చోప్రా ఆ ప్లేస్ లో సర్జరీ చేయించుకుందాం..!!

ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత చాలామంది హీరోయిన్స్ ఎక్కువగా అందాన్ని మెరుగుపరుచుకోవడం కోసం ప్లాస్టిక్ సర్జరీలు వంటివి చేయించుకుంటూ ఉంటారు.. కొన్నిసార్లు ఇలాంటివి సక్సెస్ అవుతూ ఉంటాయి మరికొన్నిసార్లు వికటిస్తూ ఉంటాయి. అలా కొన్నిసార్లు చాలామంది నటీనటులు సైతం ఇబ్బంది పడ్డ సందర్భలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అలాంటి వారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా ఒకరు.. ఈ విషయాన్ని గద్దర్-2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ అనిల్ శర్మ తెలియజేయడం జరిగింది.

అనిల్ శర్మ మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రాతో ది హీరో.. లవ్ స్టోరీ ఆఫ్ ఏ సైన్స్ అనే సినిమాని చేశారట.ఈ చిత్రానికి ప్రియాంక సైన్ చేసిన తర్వాత అడ్వాన్స్ చెక్కు కూడా ఇచ్చినట్లు తెలియజేశారు.. గద్దర్ సినిమా విడుదలైన తరువాత తాను అమెరికా, యూరప్ కు విహారయాత్రకు వెళ్లానని తెలిపారు. ఆ తరువాత రెండు నెలలకు తిరిగి వచ్చానని.. ప్రియాంక జూలియా రాబర్టులా కనిపించాలని కోరుకున్నారట. అయితే ఆ సమయంలో ఆమె ముక్కు ఆపరేషన్ చేయించుకుందని పేపర్లో చదివారట అనిల్ శర్మ..

వెంటనే ఆమెను రమ్మని చెప్పి కబురు పెట్టాను ఆ మరుసటి రోజు ప్రియాంక చోప్రా తన తల్లితో కలిసి వచ్చిందట.. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకొని చాలా బాధపడుతూ ఆపరేషన్ గురించి తనకు చెప్పారట.. ఇది ఆమె ముక్కు కింద భాగం కూడా గుర్తుని మిగిల్చిందని అది ఇప్పటికీ కూడా అలాగే ఉందని తెలిపారు. కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టిందని చెప్పి చాలా బాధపడ్డారట. అలా ప్రియాంక చోప్రా సంతకం చేసిన చాలా ప్రాజెక్టులు తొలగిపోయాయని ఆమె తల్లి చెప్పిందట. అలా తన సినిమాకు ఇచ్చిన అడ్వాన్స్ ని తిరిగి ఇవ్వాలనుకున్నారట కానీ తను మాత్రం వద్దని చెప్పి వారికి అండగా నిలిచారని తెలిపారు. సెలబ్రిటీలు చాలామంది ముందుగానే అందంగా ఉన్నారు కానీ ఆయన సర్జరీలు చేయించుకుని చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు…