నా జీవితంలో వెలుగులు పంచింది నువ్వే.. మౌనికపై మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్..!

సినీ నటుడు మంచు మనోజ్ ఈ ఏడాది మార్చి నెలలో భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇలా వీరి వివాహం తరువాత వీరిద్దరూ జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే నిన్న (అక్టోబర్ 4 ) మౌనిక రెడ్డి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా మంచు మనోజ్ ఆమెతో ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేస్తూ తనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ప్రస్తుతం మనోజ్ చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ” ప్రియమైన మున్నిలు ఈరోజు నీ పుట్టినరోజు సందర్భంగా నీపై నాకు ఉన్నటువంటి ప్రేమ ,ఇష్టాన్ని తెలియజేయాలి అనుకుంటున్నాను. నా జీవితంలో ప్రేమ వెలుగులని నింపింది నువ్వే. మన ఇద్దరినీ కలిపిన ఆ కాలానికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నువ్వు నా జీవితంలోకి వచ్చి నిస్వార్ధమైనటువంటి ప్రేమ సంతోషాన్ని పంచావు. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నీ మనసు ఎంతో మంచిది. నీ చుట్టూ ఉన్నవారి ముఖాలలో చిరునవ్వులు చిందిస్తావు.

వారంతా సంతోషంగా ఉండడానికి కారణమవుతావు. నాకున్న కోరిక అంతా ఒక్కటే నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి. నీకు అంత‌ మంచి జరగాలి మై లవ్. నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను.. ఏదైనా భరిస్తాను. నేడు నీ పుట్టినరోజు సందర్భంగా మన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను. నీ మనస్తత్వాన్ని తల్చుకుంటూ నా మనసు ఉప్పొంగిపోతుంది థాంక్యూ మై డార్లింగ్ వైఫ్ ” అంటూ మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుతం మనోజ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)