ఇస్మార్ట్ శంకర్ మూవీ తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఆ తర్వాత రెడ్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాడు. తాజాగా రామ్ నుంచి స్కంద అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించారు.
సెప్టెంబర్ 28న భారీ అంచనాల నడుమ విడుదలైన స్కందకు మిక్స్డ్ టాక్ లభించింది. అయితే పోటీగా సరైన సినిమా లేకపోవడం, పైగా లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో స్కంద హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. స్కంద డిజాస్టర్ దిశగా దూసుకెళ్తోంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కు ఇంకా రూ. 18 కోట్ల దూరంలో ఉండటంతో.. రామ్ ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయమైంది.
అయితే స్కంద ఫ్లాప్ అవుతుందని రామ్ ముందే ఊహించాడంటూ ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. దానికి పలు కారణాలు కూడా చెబుతున్నారు. స్కంద ప్రమోషన్స్ లో రామ్ ఏమాత్రం యాక్టివ్ గా లేడు. తెలుగులో కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూతో సరిపెట్టేశాడు. పైగా స్కంద షూటింగ్ పూర్తి కాకముందే పూరీ డైరెక్షన్ లో `డబుల్ ఇస్మార్ట్`ను స్టార్ట్ చేసేశాడు. రామ్ స్కంద రిజల్ట్ ను ముందే ఊహించి అలా చేశాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అందులో నిజం లేదని.. ఫలితాన్ని ముందే గ్రహితే.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అంత జోష్‌గా ఎలా మాట్లాడేవాడని అంటున్నారు. ఏదేమైనప్పటికీ స్కందతో రామ్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ ను మూటగట్టుకున్నాడు.