కొడుకు పుట్టిన శుభ‌వేళా.. మరో గుడ్ న్యూస్‌తో ఇలియాన‌.. !!

టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవదాసు సినిమాతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకుంది. త‌ర్వాత‌ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పోకిరి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకుంది. దీంతో వరుస‌ సినిమా అవకాశాలు అందుకుంటూ ఒకప్పటి స్టార్ హీరోయిన్గా వెలిగింది. నాజుకు నడుము సుందరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే త‌ను నటించిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్లాప్ అవడంతో సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఇలా అవకాశాలు తగ్గిపోవడంతో ఇలియానా బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది.

అక్కడ అదృష్టం పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసింది. అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోవడంతో ఇలియానా ఇండస్ట్రీకి దూరమైంది. ఇండస్ట్రీకి దూరమైనా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ బికినీ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాని షేక్ చేసింది. ఇలా హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ సడన్గా ప్రెగ్నెంట్ అంటూ షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ ఏంటి.. అంటూ ప‌లు కామెంట్స్ వినిపించిన ఈమె ఆ బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని అనౌన్స్ చేయలేదు. ఇక ఆగస్టు 1వ‌ తేదీన మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇక‌ తనకు కొడుకు పుట్టాడు అంటూ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది ఈ హాట్ బ్యూటి. తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికి పరిమితమైన ఇలియానా కొడుకుతో దిగిన ఫోటోలను తరచూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటుంది. బాబు పుట్టిన వేల విశేషమేంటో గానీ ఇలియానా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంతకి ఆ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా.. ఇన్ని రోజులు సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన ఇలియానాకు వెబ్ సిరీస్ లో నటించే అవకాశం వచ్చిందట.

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓ సిరీస్‌లో నటించమని ఇలియానాకు అవకాశం కల్పించాడట. ఆయన స్వయంగా తనకు ఫోన్ చేసి మరీ వెబ్ సిరీస్ లో నటించాలని చెప్పడంతో ఇలియానా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ తన కొడుకు పుట్టిన వేల విశేషం వల్లే ఇలా గుడ్ న్యూస్ విన్నా అంటూ ఆనందం వ్యక్తం చేస్తుందట. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి ఇంకా ఎటువంటి అఫీషియల్ ప్రకటన రాలేదు. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియాలంటే అఫీషియల్ ప్ర‌క‌ట‌న‌ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.