బావను పెళ్లి చేసుకుంటున్న మంగ్లీ.. క్లారిటీ ఇచ్చేసిందిగా.. !!

జానపద గీతాలు, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన పాటలు పాడుతూ ఫేమస్ అయ్యింది మంగ్లీ. బతుకమ్మ, శివుడు పాటలతో సినిమాల్లో సైతం అవకాశాలు దక్కించుకుంటూ పాపులర్ సింగర్ గా మారిపోయింది. ప్రస్తుతం ఏ మాస్ సాంగ్ అయినా సినిమాల్లో కావాలంటే మంగ్లీ వైపే మొదటి చూస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. అంతలా పేరు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం వరుస సినిమాలతో ఆల్బమ్స్ తో బిజీబిజీగా గడుపుతుంది.

ఇక గత కొన్ని రోజులుగా మంగ్లీ పెళ్లి వార్తలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఆమె త్వరలోనే ఒక ఇంటి కోడలు కాబోతుందని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని మంగ్లీ బావ వరస అయ్యే ఓ వ్యక్తితో ఆమె పెళ్లి చేసుకోబోతుందంటూ న్యూస్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మంగ్లీ అన్ని పనులను పక్కనపెట్టి మరీ పెళ్లి పనులపై కాన్సెంట్రేట్ చేసిందని వార్తలు వినిపించాయి.

ఇక ఈ వార్తలపై ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న మంగ్లీ స్పందించింది. ఆమె మాట్లాడుతూ నాకే తెలియకుండా నా పెళ్లి చేసేస్తున్నారా..? ఇంతకీ నా పెళ్ళెప్పుడు..? ఆ బావ వరస అయ్యే వ్యక్తి ఎవరో..? కాస్త ఈ పుకార్ సృష్టించిన వాళ్ళైనా చెప్పండి అయ్యా.. అంటూ సెటైరికల్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం మంగ్లీ చేసిన ఈ కామెంట్స్ తో ఆమె పెళ్లి వార్తలకు చెక్ పడింది.