” కేజిఎఫ్ ” లింక్‌తో చియాన్ విక్ర‌మ్ సినిమా… ఫ్యీజులు ఎగరాల్సిందే..!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ” తంగలాన్ ” సినిమాతో బిజీగా ఉన్న విక్రమ్.. మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు డైరెక్టర్ ఎస్. యూ అరుణ్ కుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో విక్రమ్ హీరోగా నటించబోతున్నాడని సమాచారం.

అయితే ఈ సినిమా కూడా ” తంగలాన్ ” మాదిరిగానే బ్రిటీష్ ఇండియా కాలం నటి వాస్తవ ఘటనల నేపథ్యంలో ఉండనుందని..కోలార్ గోల్డ్ ఫీల్డ్ ( కేజిఎఫ్ ) కనెక్టివిటీ తోనే ఈ స్టోరీ తెరకెక్కపోతుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది‌. అదే నిజం అయితే మ‌రోసారి ఫ్యీజులు ఎగిరే మాసీవ్ సినిమా మ‌నం చూడ‌బోతున్నాం అని చెప్పాలి.

” ప్రస్తుతం విక్రమ్, అరుణ్ కుమార్ సినిమా ప్రీ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ కొనసాగుతున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన తో పాటు మరిన్ని వివరాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నారు ” అని విక్రమ్ సన్నిహితులు చెప్పినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.