బాల‌య్య మాస్ ర‌చ్చ‌.. `భ‌గ‌వంత్ కేస‌రి` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

అఖండ‌, వీర సింహారెడ్డి చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. తాజాగా `భ‌గ‌వంత్ కేస‌రి` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మిత‌మైన‌ ఈ సినిమాకు అనిల్‌ రావిపూడి దర్శకత్వం వ‌హించాడు. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టించింది. శ్రీ‌లీల‌, అర్జున్ రాంపాల్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అక్టోబ‌ర్ 19న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. మంచి రెస్పాన్స్ ను ద‌క్కించుకుంది. ఫ‌స్టాఫ్ లో కొంత సాగ‌దీత ఉన్నా.. ఓవ‌రాల్ గా సినిమా బాగుంద‌ని మెజారిటీ పీపుల్ రివ్యూ ఇచ్చారు. బాల‌య్య-శ్రీ‌లీల‌ యాక్టింగ్, స్క్రీన్ ప్లే, బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ సీన్స్, యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ఫైన‌ల్ గా హిట్ టాక్ తెచ్చుకున్న భ‌గ‌వంత్ కేస‌రి.. ఫ‌స్ట్ డే అద్భుత‌మైన ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద బాల‌య్య మాస్ ర‌చ్చ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లోనే తొలి రోజు రూ. 14.36 కోట్ల రేంజ్ షేర్‌, రూ. 22.60 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను అందుకున్న భ‌గ‌వంత్ కేస‌రి.. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 18.27 కోట్ల షేర్‌, రూ. 30.45 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 68.50 కోట్లు కాగా.. ఇంకా రూ. 50.23 కోట్ల రేంజ్ లో షేర్ ని వ‌సూల్ చేస్తే బాల‌య్య హ్యాట్రిక్ హిట్ ఖాయ‌మ‌వుతుంది. ఇక‌ ఏరియాల వారీగా భ‌గ‌వంత్ కేస‌రి ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ ఈ విధంగా ఉన్నాయి..

నైజాం: 4.10 కోట్లు
సీడెడ్: 2.74 కోట్లు
ఉత్త‌రాంద్ర‌: 1.24 కోట్లు
తూర్పు: 0.84 కోట్లు
పశ్చిమ: 0.95 కోట్లు
గుంటూరు: 3.09 కోట్లు
కృష్ణ: 0.76 కోట్లు
నెల్లూరు: 0.64 కోట్లు
———————–
ఏపీ+తెలంగాణ‌= 14.36 కోట్లు(22.60కోట్లు~ గ్రాస్‌)
———————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా: 0.76 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 3.15 కోట్లు
———————-
వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్‌= 18.27కోట్లు(30.45కోట్లు~ గ్రాస్)
———————-