గేమ్ ఆడకుండా పదేపదే అలా చేస్తున్న శివాజీ…. ఇంత పెద్ద క‌న్నింగా…!

బిగ్ బాస్ 7లో శివాజీ ఓ ఆటగాడు. కానీ అనుకోకుండా గాయపడ్డాడు. వయసు రీత్యా కాస్త ఇబ్బంది పడుతున్న హౌస్ లో ఉన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ గత కొన్ని వారాల నుంచి కంటెస్టెంట్స్ అందరూ ఓ విషయాన్ని చెబుతున్న శివాజీ ఒప్పుకోవడంలేదు. ఇప్పుడేమో కంగారులో తనకు తానే నిజం బయటపెట్టేసాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఎలిమినేషన్ స్ఫూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.

ఉదయం నిద్ర లేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇకపోతే బిగ్ బాస్ లోకి ఎవరొచ్చినా సరే గేమ్స్ ఆడాలి, మాటలతో మెప్పించాలి. అవతల వాళ్ళని నొప్పించి అయినా విజయం సాధించాలి. తప్పు రైటో పక్కన పెడితే యాక్టివ్ గా ఉండాలి. కానీ శివాజీ మాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. కొన్ని రోజుల ముందు గేమ్ ఆడుతూ గాయపడ్డాడు. దీంతో హౌస్ లో ఉండడమైతే ఉన్నాడు కానీ బిగ్ బాస్ శివాజీని అసలు కష్టపెట్టడం లేదు.

దీంతో శివాజీకి చిరాకేస్తుంది. అదే విషయాన్ని పరోక్షంగా చెబుతూ..” నేను ఇక్కడ ఉండలేకపోతున్నా.. మీ ఇద్దరి (ప్రశాంత్, యావర్) కోసమే ఉంటున్నాను ” అని యావర్ తో చెబుతూ ఏడ్చేసాడు. గత కొన్ని వారాల నుంచి కంటిస్టేన్స్ ఇదే విషయాన్ని చెబుతున్నారు. శివాజీ అన్న.. మీరు ప్రశాంత్, యావర్ కి సపోర్ట్ చేస్తున్నారని అంటే.. శివాజీ ఒప్పుకోలేదు. ఇప్పుడేమో ఏడుస్తూ అసలు నిజం బయటపెట్టాడు. ఇది చూసిన ప్రేక్షకులు శివాజీది కన్నింగ్ గేమ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.