చిన్న‌ప్పుడు సీక్రెట్లు బ‌య‌ట పెట్టేసిన శివాజీ.. బిగ్‌బాస్ హౌస్‌లో ర‌చ్చ‌..!

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 విపరీతమైన టిఆర్పి తో దూసుకుపోతుంది. రాత్రి 9 అయితే చాలు జనాలంతా రెప్పవాల్చకుండా టీవీలకు అతుక్కుపోతున్నారు. హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శివాజీ.. తన బాల్య స్మృతులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శివాజీ హౌస్ లో డైనింగ్ టేబుల్ మీద కూర్చుని.. అమర్, భోలె , ప్రిన్స్, ప్రశాంత్, గౌతమ్, అశ్వినీలతో ..” బాల్యంలో జీవితం చాలా బాగుంటుంది. అప్పుడు కోతి కొమ్మొచ్చి, ఇసుకలో కబాడీ లాంటి ఆటలు ఆడుకునే వాళ్ళం. స్కూల్లో కర్ర పట్టుకుని చాలా దూరం దూకే వాళ్ళం.

మా పాఠశాలలో బిజీబాబా చెట్టు ఉండేది. ప్రస్తుతం ఊళ్లో ఇవేవీ లేవు “. అంటూ శివాజీ చెబుతుండగా బ్యాక్ గ్రౌండ్ లో..” గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి ” అనే సాంగ్ వస్తుంది. దీంతో శివాజీ మరింత ఎమోషనల్ అవుతాడు. ఈ వీడియోను ప్రస్తుతం శివాజీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు.