ఈ తప్పుల వల్లే మొబైల్లో బ్యాటరీ వీక్..!!

ప్రతి ఒక్కరు ఎక్కువగా స్మార్ట్ మొబైల్ ని వినియోగిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా మనం చేసే తప్పుల వల్ల మొబైల్ ఫోన్ చాలాసార్లు రిపేర్లకు వెళుతూ ఉంటుంది.. హడావిడిగా ఫోన్ కి ఛార్జింగ్ పెట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి.. అయితే ఏదైనా ప్రదేశంలో మొబైల్ చార్జింగ్ సదుపాయం లేకపోతే తక్కువగా ఉన్న చార్జింగ్ ని ఎక్కువ సేపు ఉపయోగించుకునేలా కొన్ని చిట్కాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

ఇలా చేస్తే బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు మన మొబైల్ ని ఎక్కువసేపు రన్ చేయగలిగేలా చేస్తుందట. ముఖ్యంగా బ్యాటరీ కోసం ప్రత్యేకమైన ఒక సెట్టింగ్ ఉంటుంది ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు పవర్ సేవింగ్ మోడ్ అనే సౌకర్యం ఉంటుంది. ఇది కొద్ది మంది వినియోగదారులకు మాత్రమే వీటి గురించి తెలిసి ఉంటుంది..

పవర్ ఆదా కోసం ఒకటి కాదు రెండు సెట్టింగులను అందుబాటులో ఉన్నాయి.. అవి పవర్ సేవింగ్ మోడ్, సూపర్ పవర్ సేవింగ్ మోడ్.. మన స్మార్ట్ మొబైల్ లో పవర్ సేవింగ్ మోడ్ ని ఆన్ చేయడం ద్వారా బ్యాటరీ తక్కువగా ఉన్న మొబైల్ ఎక్కువసేపు ఆన్లోనే ఉంచేలా చేస్తుంది.

సూపర్ సేవింగ్ మొడ్ ఆన్ చేస్తే బ్యాటరీ 50 శాతం కంటే తక్కువగా ఉన్నప్పుడు మనం మొబైల్ ని గంటల తరబడి ఉపయోగించుకోవచ్చు..

అయితే మొబైల్ బ్యాటరీ వీక్ కావడానికి గల కారణాల విషయానికి వస్తే..
1).ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి ఉంచడం..
2) ఇతర పిన్నులతో చార్జింగ్ చేయడం..
3). ఉపయోగం లేని యాప్స్ ను సైతం ఎక్కువగా ఉపయోగించడం.
4). ఎక్కువ వాట్స్ కలిగిన చార్జర్ తో తక్కువ వాట్స్ కలిగిన మొబైల్ కి ఛార్జింగ్ పెట్టడం.
5). ఎక్కువగా వైఫై ఉపయోగించడం బ్యాక్ గ్రౌండ్ యాప్స్ రన్నింగ్ లో ఉండడం వల్ల బ్యాటరీస్ వీక్ అవుతాయట.