జ‌వాన్ హిట్‌తో రెమ్యున‌రేష‌న్ మ‌రింత పెంచేసిన న‌య‌న‌తార‌.. ఇది మ‌రీ టూ మ‌చ్!

సౌత్ లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైనా.. కెరీర్ ప‌రంగా త‌గ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. ఇటీవ‌లె `జ‌వాన్‌` మూవీతో బాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హీరోగా న‌టించారు. గ‌త నెల‌లో విడుద‌లైన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ భారీ విజ‌యాన్ని అందుకుంది.

బాక్సాఫీస్ వ‌ద్ద వెయ్యి కోట్ల రేంజ్ లో వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ సినిమాకు రూ. 10 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ తీసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన న‌య‌న‌తార‌.. ఇప్పుడు త‌న రేటు మ‌రింత పెంచేసి నిర్మాత‌ల‌కు చుక్క‌లు చూపిస్తుంద‌ట‌. జ‌వాన్ హిట్ తో న‌య‌న‌తారకు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్ప‌డింది. మ‌రిన్ని ఆఫ‌ర్లు కూడా క్యూ క‌డుతున్నాయి.

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రూ. 13 కోట్లు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేస్తుంద‌ట‌. అందుకు ఒక్క రూపాయి త‌గ్గినా.. సినిమాకు సైన్ చేయ‌న‌ని చెబుతుంద‌ట‌. తాజాగా ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలి త‌న తాజా చిత్రంలో న‌య‌న‌తార‌ను ఒక ముఖ్య పాత్ర కోసం సంప్ర‌దించ‌గా.. అదే రేంజ్ లో ఆమె పారితోషికం అడిగింద‌ట‌. ఈ విష‌యం నెట్టింట వైర‌ల్ గా మారడంతో.. ఇది మ‌రీ టూ మ‌చ్ న‌య‌న్ అంటూ సినీ ప్రియులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, న‌య‌న‌తార ఇప్పుడు త‌మిళంలో ది టెస్ట్‌, మన్నంగట్టి సిన్స్ 1960 తో స‌హా ప‌లు సినిమాల్లో న‌టిస్తోంది.