దటీజ్ ఎన్టీఆర్.. చిరు ప్రయత్నం వ్యర్థమేనా..?

ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం ఒకప్పుడు ఏ హీరోకైనా ఇండస్ట్రీలో అవార్డు వచ్చిందంటే గొప్పగా చెప్పుకునే వారు.. ఇప్పుడు అలా కాదు ఆ అవార్డు వెనుక ఎవరు ఉన్నారు అని అడుగుతున్నారు. బహుశా అందుకేనేమో అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు వచ్చినా కూడా అదేమి గొప్ప విషయం కాదు అనేలా భావించారు. కానీ ఆస్కార్ అవార్డు మాత్రం ఎవరు ఇప్పించలేరు. ఎందుకంటే ఆ అవార్డుకు అంతా ఇమేజ్ ను గౌరవాన్ని దక్కించుకుంది.

అందుకు ప్రధాన కారణం.. ఆస్కార్ లో పైరవీలు చేయలేరు. టాలెంట్ ఉంటేనే అవార్డు వస్తుంది. లేదు అంటే.. వాళ్లు ఇతర దేశ సినిమాలను అస్సలు పట్టించుకోరు..అలాంటిది మన తెలుగు నటుడు అయిన ఎన్టీఆర్ కి అలాంటి గౌరవం దక్కింది.RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన ఎన్టీఆర్ కు ఆస్కార్ అకాడమీ యాక్టర్స్ బ్రాంచ్‌లో చోటు దక్కింది. మొత్తం ఐదుగురు యాక్టర్లను తమ యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. చాలామంది ఎన్టీఆర్ ని చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

లోకల్ మీడియాలో తారక్ గురించి అద్భుతంగా రాయకపోవచ్చు.. అలాగే నేషనల్ అవార్డు రాకపోవచ్చు. కానీ ఆస్కార్ అవార్డుని తన సొంతం చేసుకున్నాడు. నిజానికి RRR సినిమాలో నాటు నాటు పాటకు వచ్చిన ఆస్కార్ అవార్డు సమయంలో చరణ్ ని దగ్గరుండి మరి ఆకాశానికి ఎత్తారు మెగాస్టార్ చిరంజీవి ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటూ వార్తలు కూడా రాయించారు. కానీ చివరకు ఇప్పుడు ఏకంగా ఎన్టీఆర్ ను తమ ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్‌లోకి ఆహ్వానిస్తున్నట్లు ఆస్కార్ అకాడమీ ప్రకటించింది. దీంతో గతంలో రామ్ చరణ్ ని పొగిడిన వారంతా ఇప్పుడు ఎన్టీఆర్ ని పొగిడేస్తూ ఈ సమయంలో చిరంజీవి ఏం చేస్తారంటూ వాపోతున్నారు.