పిల్లలకు ఫూల్ మఖానా పెడితే ఏం జ‌రుగుతుందంటే..!!

ఫూల్ మఖాన లేదా ఫాక్స్ నట్స్ ఈ ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాల్ నట్స్, బాదంపప్పు, జీడిపప్పులు ఇవి కూడా ఒక రకమైన నట్స్. వీటిలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఫూల్ మఖానాను నెయ్యిలో వేయించి పిల్లలకు ఇస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు.

వారు మెదడు ఎదుగుదలకు, శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల చర్మం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

వీటిలో ఉండే లక్షణాలు శరీరాన్ని అనేక సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతుంది. గుండెకు రక్త ప్రసరణ సరిగ్గా అందేలా చేస్తుంది. ఇతర అవయవాలకు కూడా ఆక్సిజన్ పోషకాలు అందేలా చేస్తాయి. మూత్రపిండాలను కాపాడడంలో కూడా బాగా పనిచేస్తాయి.