ఓటీటీలో కూడా సంచలనం సృష్టిస్తున ర‌జినీ మూవీ..!!

రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఇటీవల థియేటర్స్ లో బీభత్సవాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతుంది. ఊహించని రేంజ్‌లో రికార్డులను సృష్టిస్తుంది. అమెజాన్ ప్రైమ్ మినితో ఈ సినిమా ఇండియా అంతట నెంబర్ 1 ట్రెండింగ్ మూవీగా కొనసాగుతుంది. ఇందులో ఆశ్చర్యమేముంది.. స్టార్ హీరో సినిమా ఏది స్రీమింగ్ అయినా ఓటీడీలో ట్రెండింగ్ లోనే ఉంటుంది అనుకుంటున్నారా.

జైలర్ సినిమా ఇంతటితో ఆగలేదు మరొక రికార్డును సృష్టించింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో టాప్ రన్నింగ్ లో నిలిచింది. అంతేకాకుండా హాంకాంగ్, మలేషియా, కాదర్ లాంటి 29 దేశాల్లో కూడా జైలర్ సినిమానే టాప్ ట్రెండింగ్ లో నిలవడం గమనార్హం. అంటే ఆదేశాల్లో కూడా జైల‌ర్‌ సినిమా భారీ సంఖ్యలో వీక్షించిన‌ట్లు కొత్త రికార్డు వచ్చింది.

ఒక తమిళనాడులోనే రూ.100 కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి తమిళ‌ సినిమాగా రికార్డ్ సృష్టించింది. నెల్సన్ దర్శకత్వం వహించిన జైలర్ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, యోగి బాబు, వసంత్‌ రవి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ స్పెషల్ రోల్స్‌లో కనిపించి మెప్పించారు. ఇది ఓ అద్భుతం అని చెప్పాలి అయితే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నా తమిళనాడులో కూడా థియేటర్స్‌లో ఇంకా అదే క్రేజ్ తో నడుస్తోంది.