నిర్మాత‌ల కొడుకులు… టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన వేళ‌…

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అవుదామని అడుగుపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది మాత్రమే మంచిగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోగా క్రేజ్ సొంతం చేసుకుంటారు. ఇలా ఎంతో మంది సినీ బ్యాగ్రౌండ్తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలుగా మారిన వారు కూడా ఉన్నారు. కొంతమంది హీరోల కొడుకులు హీరోలుగా వచ్చి సక్సెస్ అవుతుంటే మరికొందరు ఊహించిన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ప్రొడ్యూసర్ కొడుకులు కూడా ఇండస్ట్రీలో హీరోలుగా అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు. అలాగే కొంతమంది హీరోగా వచ్చిన సక్సెస్ కాలేకపోయారు. వారు ఎవరో ఒకసారి చూద్దాం.

వెంకటేష్ :


టాలీవుడ్ లో ఒకప్పుడు ప్రముఖ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన డి. రామానాయుడు తనయుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన వెంకటేష్ స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

అల్లు అర్జున్ :


టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ తనయుడుగా అల్లు అర్జున్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదట్లో ఎన్నో బాడీ షేమింగ్స్‌ను ఫేస్ చేసిన అల్లు అర్జున్ తర్వాత స్టైలిష్ స్టార్ గా యూత్ ఐకాన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల ది బెస్ట్ యాక్టర్ గా మొదట నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ హీరోగా తిరుగులేని క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

వడ్డే నవీన్ :


టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పటి స్టార్ ప్రొడ్యూసర్ గా ఉన్న వడ్డే రమేష్ కొడుకైన వడ్డే నవీన్ కూడా ఇండస్ట్రీ లో హీరోగా అడుగు పెట్టాడు. అయితే సరైన ప్లానింగ్ లేకపోవడంతో నార్మల్ గా సినిమాల్లో హీరో అయినప్పటికీ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఆయనకి మొదట్లో వరుసగా సినిమా అవకాశాలు వచ్చిన తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకోలేని నవీన్ తక్కువ సమయంలోనే ఇండస్ట్రీ నుంచి ఫెడవుట్ అయ్యాడు.

బెల్లంకొండ శ్రీనివాస్ :


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. అయితే ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తున్న ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోతున్నాడు.