కోలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు ఐదు దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న కమల్ హాసన్.. ఏడు పదులు వయసుకు చేరవవుతున్నా కూడా ఇంకా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాయి. అలాగే నిర్మాతగా, హోస్ట్‌గా, వ్యాపారవేత్తగా కూడా సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న కమల్ హాసన్.. ఆత్మహత్యలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు. చీకటి అనేది జీవితంలో శాశ్వతంగా ఉండిపోదు. లైఫ్ లోకి ఖచ్చితంగా వెలుగు వస్తుంది. చీకటిని అంతం చేస్తుంది. అలాగే కష్టాలు కూడా ఎప్పుడూ మనతోనే ఉండవు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. ఇండస్ట్రీలో నాకు మంచి అవకాశాలు రావడంలేదని, తగినంత గుర్తింపు లభించట్లేదని ఫీలయ్యాను. అప్పుడే చనిపోవాలని భావించా. ఇదే విషయాన్ని నా గురువు అనంతకు కూడా చెప్పాను.
ఆయన నీ పని నువ్వు చేసుకుంటూ పో.. సరైన సమయం వచ్చినప్పుడు ఆ గుర్తింపు దానంతట అదే వస్తుంది అని సలహా ఇచ్చారు. ఆ క్షణమే నేను సూసైడ్ ఆలోచన వినిపించుకున్న. హత్య ఎంత నేరమో ఆత్మహత్య కూడా అంతే నేరం, పాపం. చావు అనేది లైఫ్ లో భాగమే. కానీ దానికోసం ఎదురు చూడడం, ఎదురు వెళ్లడం ఏమాత్రం కరెక్ట్ కాదు` అంటూ కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. దీంతో ఈయన కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి. కాగా, విక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం కమల్ హాసన్.. `ఇండియన్ 2` మూవీతో బిజీ అయ్యారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఆల్మోస్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.