వేలాది మంది అనాధ పిల్లలకు ” జవాన్ ” మూవీ చూపించిన షారుక్.. అభిమానుల ప్ర‌సంస‌లు..!!

షారుక్ ఖాన్ ” జవాన్ ” సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్లో చేరగా… ఈ హ్యాపీ మూమెంట్లో ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవుతున్నాడు హీరో షారుక్‌.

ఈ క్రమంలోనే ఓ అభిమాని.. షారుక్కి ” మీర్ ఫౌండేషన్” సేవలు కొనసాగించాలని సలహా ఇచ్చాడు. కోవిడ్ టైంలో ఆదుకున్నట్టుగానే ఇప్పుడు కూడా జనాల గురించి పట్టించుకోవాలని సూచించాడు. దీంతో ఆ అభిమానిని ప్రశంసిస్తూ.. దీనిపై వెంటనే రియాక్ట్ అయ్యాడు షారుక్.

దేశవ్యాప్తంగా 20 ఎన్జీఓలకు చెందిన వేలాదిమంది అనాధ పిల్లలకు ఫ్రీగా ” జవాన్ ” సినిమా చూపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ” మీర్ ఫౌండేషన్ ” ఎకౌంట్లో పోస్ట్ చేయగా.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. మా షారుక్ సినిమాలోనే కాదు.. బయట కూడా రియల్ హీరో అంటూ తెగ పొగిడేస్తున్నారు.