భారీ బడ్జెట్‌తో ‘ గుంటూరు కారం ‘ ఆడియో రైట్స్ దక్కించుకున్న ఆ సంస్థ..?

దాదాపుగా 12 ఏళ్ల అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్, కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. ఈ మూవీపై మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ స్థాయి అంచనాలు ఉన్నాయి.

ఎస్ ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాని హారిక హసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తోంది. ప్రస్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న గుంటూరు కారం నుంచి అతి త్వరలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు సమాచారం.

లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ మ్యూజికల్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ వారు సొంతం చేసుకుంటున్నాట్లు టాక్. అన్ని కార్యక్రమాలు ముగించి గుంటూరు కారం మూవీని 2024 జనవరి 12న విడుదల చేయనున్నారు. అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు ఇందులో విలన్ గా కనిపించనున్నాడు.