ప‌రువాల విందుతో ప‌రేషాన్ చేస్తున్న డింపుల్‌.. ఈ రేంజ్ లో చూపిస్తే కుర్ర‌కారు ఏమైపోవాలి..?

డింపుల్ హయాతి.. ఈ డ‌స్కీ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. హైద‌రాబాద్ లో పుట్టి పెరిగిన డింపుల్‌.. 2017లో `గల్ఫ్` అనే మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేసింది. కానీ, పెద్ద‌గా గుర్తుంపు రాలేదు. అప్పుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ సూప‌ర్ హిట్ మూవీ `గద్దలకొండ గణేష్` మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫ‌ర్ వ‌చ్చింది.

ఇందులో `జర్ర జర్ర` అనే స్పెష‌ల్ సాంగ్ తో డింపుల్ ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్ ద్వారా ఆమెకు బాగా పాపుల‌రిటీ ఇచ్చింది. అలాగే వ‌రుస‌గా సినిమాల్లోకి అవ‌కాశాలు వ‌చ్చాయి. అలా విశాల్ తో సామాన్యుడు, రావితేజ‌తో ఖిలాడి, గోపీచంద్ తో రామబాణం చిత్రాలు చేసింది. ఇవ‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్ట‌డంతో.. డింపుల్ కు ఐర‌న్ లెగ్ అనే ముద్ర ప‌డిపోయింది. ఆఫ‌ర్లు రావ‌డం ఆగిపోయాయి.

దీంతో సోష‌ల్ మీడియాలో యాక్టివ్ అయిన డింపుల్ హ‌యాతి.. ఎలాంటి హ‌ద్దులు లేకుండా స్కిన్ షోతో చేస్తూ ఎట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో అరాచ‌కం సృష్టించింది. స్లీవ్ లెస్ గ్రీన్ ఫ్రాక్ లో అందంగా ముస్తాబైన డింపుల్‌.. ప‌రువాల విందుతో ప‌రేషాన్ చేసింది. ఉప్పొంగే ఎద సోయ‌గాల‌ను ఎర‌గా వేస్తూ య‌మా హాట్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. డింపుల్ లేటెస్ట్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో డింపుల్ ఈ రేంజ్ లో చూపిస్తే కుర్ర‌కారు ఏమైపోవాల‌ని కొంద‌రు నెటిజ‌న్లు అంటుంటే.. హాట్‌, ఫైర్ అని మ‌రికొంత మంది కామెంట్స్ వ‌దులుతున్నారు.