సూపర్ స్టార్ మహేష్‌కి నచ్చిన మరో మూవీ.. ఫుల్ ఎంజాయ్ చేశా అంటూ (ట్వీట్)…!!

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇప్పుడు ” గుంటూరు కారం” అనే సాలిడ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ తో పాటుగా మహేష్ కు ఉన్న గ్యాప్ లో లేటెస్ట్ మూవీలు కూడా చూసేస్తున్నాడు.

మరి అలా మొన్ననే బాలీవుడ్ బాద్షా షారూఖ్ నటించిన జవాన్ చూసి తన స్పందనను తెలియజేయగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో సినిమా ” మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ” సినిమాని చూశాడు. మరి ఈ సినిమా చూసి తన స్పందనను తెలియజేసిన మహేష్.. ఈ సినిమా చూసి ఓ రేంజ్ లో ఎంజాయ్ చేసినట్టుగా తెలిపాడు.

సూపర్ ఫన్ గా ఈ సినిమా ఉండగా మా ఫ్యామిలీ అంతా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేసామని.. అలాగే నవీన్ ఈ సినిమాకి మెయిన్ అట్రాక్షన్.. అనుష్క ఎప్పట్లానే అదరగొట్టేసింది. దర్శకుడు మహేష్ మూవీ‌ క్రియేషన్స్ వారు మంచి సినిమా అందించారు అని మహేష్ ప్రశంసలు కురిపించాడు. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు.