మంచు విష్ణు- ప్రభాస్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉన్నారు.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన భక్త కన్నప్ప సినిమాను ఇటీవలే భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు తెలియజేశారు. ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారుతోంది.. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో పోషిస్తున్నట్లు సమాచారం.. ఈ విషయాన్ని మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

Prabhas Diwali Party with Manchu Vishnu

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ప్రచారం సాగుతోంది.. దీనిపై మంచు విష్ణు హరిహర మహాదేవంటూ రాసుకొచ్చారు.. ఇది చూసిన సినీ ప్రియులు అభిమానుల సైతం కన్నప్ప చిత్రంలో ప్రభాస్ శివుడిగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ప్రభాస్ మూడవసారి దేవుడి పాత్రలో కనిపించే అవకాశం అభిమానులకు దక్కుతోంది.. ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ చిత్రంలో రాముడు గా కనిపించగా కల్కీ లో విష్ణుమూర్తిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

విష్ణు ఎన్నో ఏళ్ల క్రితమే భక్తకన్నప్ప సినిమాని తెరకెక్కించాలని పలు ప్రయత్నాలు చేశారు. కానీ ఈమధ్య కుదిరింది.ఈ సినిమాలో నుపుర్ హీరోయిన్గా నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కోసం న్యూజిలాండ్ కి వెళ్ళబోతున్నట్లు మంచు విష్ణు సినిమా షూటింగ్ ప్రారంభంలో తెలియజేశారు. నేటి తరానికి భక్తకన్నప్ప గొప్పతనాన్ని తెలియజేయాలని సంకల్పంతో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలిపారు విష్ణు. దాదాపుగా 150 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిస్తూ ఉన్నారు.