గోపీచంద్, శ్రీనువైట్ల మూవీకి…. ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇదే….!!

యాక్షన్ హీరో గోపీచంద్ ఇటీవల రామబాణం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే అందుకోలేకపోయింది. ఇక దాని అనంతరం ప్రస్తుతం భీమా మూవీ చేస్తున్న గోపీచంద్ తాజాగా కామెడీ యాక్షన్ సినిమాల దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేసేందుకు సిద్ధం అయ్యాడు.

నేడు గ్రాండ్గా లాంచ్ అయినా ఈ మూవీని చిత్రాలయం స్టూడియోస్ సంస్థపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా వేణు దోనేపూడి ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అయితే అసలు విషయం ఏమిటంటే… ఇక ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటించాల్సి ఉన్న ఈ మూవీకి విశ్వం అనే టైటిల్ ని యూనిట్ పరిశీలిస్తుందట.

స్క్రిప్ట్ కి తగ్గట్టుగా ఈ టైటిల్ సరిపోతుందని అంటున్నారు. అయితే ఈ మూవీ శ్రీనువైట్ల మార్క్ ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్‌గా రూపొందుతుంద‌ని సమాచారం. ఇక ఈ మూవీ యొక్క షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది.