రోడ్డు ప్రమాదం జరిగిందంటూ వస్తున్న వార్తలు పై స్పందించిన దీప్తి సునయన..!!

టిక్ టాక్ , డబ్ స్మాష్ వీడియోల ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు.. ఆ తరువాత ఈమె యూట్యూబ్లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ వెంటనే పలు రకాల షార్ట్ ఫిలిమ్స్ నటిస్తూ మంచి క్రేజీ అందుకుంది. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది.. గతంలో షణ్ముఖ, దీప్తి సునైస ప్రేమించుకుంటున్నారు అనే వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి.

 

సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉండడం జరుగుతూ ఉంటుంది.. అయితే ఈరోజు ఒక ఫాలోవర్ ఆమె దృష్టికి ఒక విషయాన్ని తీసుకువెళ్లడం జరిగింది.. నిజానికి ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని ఆమె తెలియజేయడం జరిగింది. ఇలా వార్తలు రావడానికి ముఖ్య కారణం ఒక వీడియో అని అందులో తనకు యాక్సిడెంట్ అవుతున్నట్టుగా ఉంటుంది అంటూ తెలియజేసింది.. అయితే అది నిజమైన యాక్సిడెంట్ కాదని సుమారుగా 8 ఏళ్ల క్రితం ఆలియా ఖాన్ అనే షార్ట్ ఫిలిం చేశానని అందులోని ఒక క్లిప్ ఇలా తనకు యాక్సిడెంట్ అయినట్టుగా సృష్టించారని తెలియజేసింది.

తనకు ఏమీ కాలేదని ప్రస్తుతానికి తను చాలా బాగానే ఉన్నానంటూ తెలియజేసింది. దీంతో యాక్సిడెంట్ అయిందని వస్తున్న రూమర్లకు చెక్ పెట్టింది దీప్తి సునైస.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి రాబోయే రోజుల్లో పలు సినిమాలలో నటించే అవకాశాలను ఈ ముద్దుగుమ్మ అందుకుంటుందేమో చూడాలి మరి.