న‌య‌న్ టూ ర‌ష్మిక బాలీవుడ్‌లో హంగామా చేస్తోన్న సౌత్ బ్యూటిలు వీళ్ళే..!

గత కొన్ని ఏళ్లుగా మన టాలీవుడ్ సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో హీరోలకు పోటీగా హీరోయిన్లు కూడా పాన్ ఇండియా లెవెల్‌లో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. ఈ లిస్ట్‌లోనే తాజాగా పూజ హెగ్డే, రష్మిక, నయనతార కూడా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి నార్త్ ప్రేక్షకులను పలకరించారు. ఇలా బీటౌన్‌లో సత్తా చాటిన సౌత్ భామలు ఎవరో ఒకసారి చూద్దాం.

నయనతార:


ఇప్పటివరకు సౌత్‌ స్టార్ హీరోయిన్గా రాణించిన నయనతార తొలిసారి అట్లీ డైరెక్షన్లో షారుక్ ఖాన్ హీరోగా జవాన్ సినిమాలో నటించి బాలీవుడ్‌కి పరిచయమైంది. బాలీవుడ్ లో ఈమె నటనకు అక్కడ ప్రేక్షకులు ముగ్దులైపోయారు.

రష్మిక మందన:


ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ టక్కర్ అనే ఒక ప్రైవేట్ ఆల్బమ్‌తో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించింది. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ఇప్పటికే గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయింది. త్వరలోనే యానిమల్ మూవీ తో బాలీవుడ్ ప్రేక్షకులు మ‌రోసారి పలకరించబోతుంది.

పూజా హెగ్డే:


నిన్న మొన్నటి వ‌ర‌కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన పూజ హెగ్డే కొంతకాలం క్రితం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి హృతిక్ రోషన్ హీరోగా నటించిన మొహంజదారో సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. తర్వాత అక్షయ్ కుమార్ తో హౌస్ ఫుల్, సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కబీ ఈద్ కబీ దీవాళిలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో వెంకటేష్ చెల్లెలుగా పూజ హెగ్డే కనిపిస్తుంది.

ప్రణ‌తి సుభాష్:

టాలీవుడ్‌లో చేసినవి తక్కువ సినిమాలైనా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రణతి శుభాష్ ఈ సినిమాతో బాలీవుడ్‌ను పలకరించింది. హాట్ స్టార్ లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది.

రెజీనా కసాండ్రా:


రెజినా కూడా టాలీవుడ్ లో మంచి పాపులారిటి దక్కించుకున్న హీరోయిన్. ఈమె కూడా బాలీవుడ్‌లో ఏక్ ల‌డ్కి కో దేఖాతో ఐసా లగా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్‌లతో రాణిస్తుంది.

ఐశ్వర్య రాజేష్ :


ఐశ్వర్య రాజేష్ హిందీలో అర్జున్ రామ్‌పాల్ హీరోగా నటించిన డాడీ సినిమాతో బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతగా అల్లరించలేకపోయింది.

త్రిష‌:


టాలీవుడ్ టాప్ స్టార్ హీరోయిన్గా రాణించిన త్రిష బాలీవుడ్ లో కట్ట మిట్ట అనే సినిమాతో అక్షయ్ కుమార్ సరసన నటించిన ఏకైక సినిమా అదే.

ప్రియమణి:


ఒకప్పుడు టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె హిందీలో రక్త చరిత్ర సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల షారుక్ నటించిన జవాన్ సినిమాలో కూడా ఓ కీల‌క‌ పాత్రలో నటించింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ లో నటిస్తుంది.

సమంత :


ప్రస్తుతం అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్ళిన ఈమె టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుకుంది. దీ ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.

ఇక అదే రూట్లో సైట్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్స్ గా నటించినా ఆసిన్, ఇలియానా, శ్రేయ శరణ్, రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, తమన్న, తాప్సి, ఐశ్వర్యరాయ్, దీపిక పదుకొనే, కృతి సనన్, శృతిహాసన్, నగ్మా ఇలా అందరూ బాలీవుడ్ కి ఎంట్రీషి తమ సత్తా చాటుకున్నారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ ఐన రమ్యకృష్ణ, రంభ, సౌందర్య, జయసుధ, రోజా, మీనా, జయప్రద, విజయశాంతి, భానుప్రియ, రాధా, రాధిక, శాంతిప్రియ, శ్రీదేవి, రేఖ కూడా బాలీవుడ్ సినిమాలో నటించారు.