ఈ సింపుల్ టిప్స్‌తో అటుకుల దోశ త‌యార్‌.. అద్భుతమైన రుచితో…!!

అటుకుల తో పాయసం, ఉప్మా, పోపు వంటివి చేస్తుంటాం. అలాగే అటుకుల తో దోశ తయారు చేసుకోవచ్చు. ఎప్పుడు మనం రోజూ ఉప్మా, దోస, ఇడ్లీ వంటివి కాకుండా కొత్తగా అటుకుల తో దోశ తయారు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
• ఒక కప్పు అటుకులు

• ఒక కప్పు బొంబాయి రవ్వ

• ఒక కప్పు పెరుగు

• తగినంత ఉప్పు

• ఒక కప్పు నీరు

• చిటికెడు బేకింగ్ సోడా

తయారీ విధానం:
ఒక గిన్నెలో అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు, ఉప్పు కలిపి అరగంటసేపు ఉంచుకోవాలి. తరువాత కొద్దిగా నీరు పోసి మిక్సి పట్టాలి. దానిలో బేకింగ్ సోడా వేసి కలపాలి. దీనిని దోస పిండిలా జారుడు అయ్యేలా చెయ్యాలి. ఇప్పుడు దీనితో పెనం మీద దోశల వేసుకుని కొద్దిగా నూనె వేసి రెండు వైపులా కాల్చాలి. ఇలా తయారు చేసుకున్న అటుకుల దోశకు అల్లం చట్నీ లేదా కొబ్బరి చట్నీ పెట్టుకుని తింటే చాలా రుచికరంగా ఉంటుంది.