బార్బీ బొమ్మ‌లా సితార‌.. ఇంత‌కీ ఆమె ధ‌రించిన పింక్ గౌను ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ‌త్ర దంప‌తుల ముద్దులు కూతురు సితార ఘ‌ట్ట‌మ‌నేని గురించి ప్ర‌త్యేక‌మైన పరిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ కిడ్స్‌లో సితార ముందు వ‌ర‌స‌లో ఉంది. చిన్న త‌నంలోనే సితార ఎన్నో ఘ‌న‌త‌లు సొంతం చేసుకుంటోంది. ఇటీవ‌ల నగల తయారీ సంస్థ పీఎమ్‌జీ జ్యువెలర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది.

స‌ద‌రు సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ని క్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన యాడ్ ను ఏకంగా న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ లో ప్ర‌ద‌ర్శించారు. అలాగే అవకాశం దొరికినప్పుడంతా సితార త‌న‌లోని టాలెంట్ ను బ‌య‌ట‌పెడితోంది. డ్యాన్స్ వీడియోలు, అదిరిపోయే ఫోటో షూట్ల‌తో సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంటోంది. అలాగే యాక్టింగ్ పై త‌న‌కు ఇంట్రెస్ట్ ఉందంటూ ఇప్ప‌టికే సితార పలు ప్రెస్ మీట్స్ లో ఓపెన్ అయింది.

మ‌రోవైపు అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌కు కూడా సితార‌ ప్రసిద్ది చెందింది. తాజాగా ఈ చిన్నారి త‌న తల్లి నమ్ర‌తతో క‌లిసి హైద‌రాబాద్ లో జ‌రిగి ఓ ఈవెంట్ లో సంద‌డి చేసింది. అయితే ఈ సంద‌ర్భంగా చేసిన ఫోటో షూట్ ను సితార ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది. ఈ పిక్స్ లో పింక్ క‌ల‌ర్ గౌనులో బార్బీ బొమ్మ‌లా ఆమె ఎంతో అందంగా మెరిసిపోయింది. దీంతో నెటిజ‌న్లు సితార తాజా పిక్స్ పై లైకుల వ‌ర్షం కురిపించారు. అయితే ఇప్పుడు సితార గౌను ధ‌ర హాట్ టాపిక్ గా మారింది. బేబీ పింక్ హోయిటీ మోప్పెట్ గౌనులో సితార మెరిసింది. అయితే ఫ్రాక్ ధ‌ర రూ. 12.5 వేలు. ఈ విష‌యం తెలిసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ప‌దేళ్ల పాప‌కు 13 వేల రూపాయిల గౌనా.. సితార కొంచెం పెద్దైతే కాస్ట్లీ వస్తువుల‌ విష‌యంలో మ‌హేష్ బాబునే మించిపోతుందంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు.