మరోసారి సమంతతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న బన్నీ.. ఏ సినిమాలో అంటే..?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలు భళే సెట్ అవుతూ ఉంటాయి . అనుకోకుండా సెట్ అయినా సరే ఆ కాంబోలు పదే పదే రిపీట్ అవుతూ సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతూ ఉంటాయి. అలాంటి ఓ క్రేజీ కాంబోనే బన్నీ – సమంత. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ .. ప్రెసెంట్ ఎలాంటి టాప్ పొజిషన్లో ఉన్నాడో మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

ఒక్కొక్క సినిమాకి వంద నుంచి 150 కోట్లు పారితోషకం తీసుకునే స్ధాయికి ఎదిగిన బన్నీ ..తన లక్కీ డైరెక్టర్స్ ని మాత్రం ఏ మాత్రం వదలట్లేదు . ఈ క్రమంలోనే పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వకముందే మరో క్రేజీ డైరెక్టర్ కి కాల్ షీట్స్ ఇచ్చేసిన విషయం తెలిసిందే . తన లక్కీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో మరొక క్రేజీ కాంబో ని ఫిక్స్ చేసుకున్నాడు అల్లు అర్జున్ . అయితే ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి .

గతంలో వీళ్ళు కలిసి నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా ఎంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందో మనకు తెలిసిందే . ఆ తర్వాత పుష్ప2 సినిమాలో ఐటమ్ సాంగ్ లో వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ అద్దిరిపోయింది . ఆ తర్వాత మళ్లీ బన్నీ – సమంత ఈ సినిమాలో కనిపించబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఈసారి ఈ కాంబో ఎలాంటి విజయం అందుకుంటుందో..?