ప్రధాని మోదీ ఆస్తి చూస్తే షాక్ అవుతారు..!!

మన ప్రధాని నరేంద్ర మోడీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇక ఆయన ఆస్తి విషయానికి వస్తే గ తేడాలతో పోలిస్తే కేవలం రూ.35 లక్షల మాత్రమే పెరిగాయి. స్థిరాస్తులు ఏమీ లేవు. గాంధీనగర్ ఎస్‌బిఐ బ్రాంచ్ లోనే 95% డిపాజిట్లు. ప్రస్తుత ఢిల్లీ ప్రధాని మోదీ మొత్తం ఆస్తి విలువ కేవలం రూ.2,58,96,444 లు మార్చి 31 తో ముగిసిన 2022 – 23 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి ఆయన సమర్పించిన ఆస్తి అప్పుల పట్టి ఈ విషయాన్ని తెలియజేస్తుంది.

ఇంకా గ‌తేడాది నాటికి మోడీ ఆస్తి విలువ రూ.2,23,82,504 కాగ‌.. ఈ ఏడాదిలో రూ.35,13,940 పెరుగుదల కనిపించింది. ఆయన పేరున కొంత నగదు బ్యాంకులో ఫిక్స్డ్, మల్టీ ఆప్షన్ డిపాజిట్లు , నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, నాలుగు బంగారం ఉంగరాలు తప్పితే ఇతర స్థిర చరాస్తులు ఏమీ లేవట. గ తేడాది ఎల్ఐసి పాలసీలు చూపిన ఈసారి వాటి గురించి చెప్పలేదు. ఆయన ఆస్తిలో 95.5% గుజరాత్ లోని గాంధీ నగర్ లో ఎస్‌బిఐ, ఎంఎస్సీ బ్రాంచ్ లో రూపంలోనే ఉంది.

గత సంవత్సరంలో పోలిస్తే దాని విలువ 17.64% పెరిగింది. అదే ఎస్‌బిఐ లోని మరో ఖాతాలో నగదు నిల్వ రూ.46 వేల నుంచి మినిమం బాలన్స్ రూ.574 కి తగ్గిపోయింది. ఆయన డిపాజిట్లు పోస్టల్ సేవింగ్ సర్టిఫికెట్స్ విలువ ఈసారి పెరిగింది. ఇక అతడి సతీమణి జశోదాబెన్ పేరున ఉన్న ఆస్తి వివరాలు మోడీకి తెలియవని వివరించాడు.