ఈ నీటిని తాగితే గ్యాస్, మంట చిటికెలో తగ్గిపోతుంది..!!

మారిన కాలం, ఆరోగ్యపు అలవాట్లు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. టైం కు తినకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. శరీరానికి పడని వస్తువులు తీసుకోవడం వల్ల కూడా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి టైం లో ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఈ అసిడిటీ సమస్య ఉన్నప్పుడు ఛాతీ పై ఇబ్బందిగా ఉంటుంది. కొన్ని పదార్థాలను తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. ఈ సమస్యని తగ్గించేందుకు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే చాలు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ ఈ డ్రింక్స్ లో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది.

2. ఉల్లి, వెల్లుల్లిలో ఎక్కువ ఫ్రక్టాన్లు ఉంటాయి. ఈ మూలకాలు కరిగే ఫైబర్స్. ఇవి కడుపులో తీవ్రమైన ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా పచ్చి కూరగాయల సలాడ్ కూడా ఈ సమస్యను కలిగిస్తుంది.

3. ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యాబేజీలు తినడం వల్ల కడుపులో ఆసిడిటీ ఏర్పడుతుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్య నుంచి బయటపడేందుకు ఎలాంటి ఆహారాలని తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

4. పప్పు ధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. బీన్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు ఒలిగోశాకరైడ్స్ జీర్ణ క్రియ బలహీనమైనప్పుడు వీటిని జీర్ణం చేసుకోలేం. అందుకే తక్కువగా తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Woman touching stomach painful suffering from stomachache causes of menstruation period, gastric ulcer, appendicitis or gastrointestinal system disease. Healthcare and health insurance concept

5. ఆహారం తిన్న తర్వాత సెలెరీ, సోంపు, జీలకర్ర కషాయాలు తీసుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధ‌నియాల‌ నీటిని తాగాలి. ఉప్పు వాడకాన్ని తగ్గించడం మంచిది. ఆహారాన్ని నిదానంగా నమిలి తినడం మేలని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు నీరుని ఎక్కువగా తాగాలి. 8 గంటలు నిద్ర పోవాలి అప్పుడే ఆరోగ్యం కూడా క్షేమంగా ఉంటుంది.