మనసు చంపుకుని అలా చేయబోతున్న నాగచైతన్య..ఏ మగాడికి-మొగుడుకి రాకూడని కష్టం వచ్చిందే..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ పేరు సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతున్న అక్కినేని హీరో నాగచైతన్య తన మాజీ భార్య సమంత నటించిన ఖుషి సినిమాలో చూడబోతున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది . రీసెంట్ గానే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత – విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా ఖుషి .

ఈ సినిమా ఫుల్ టూ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. సినిమాలో పెద్దగా చెప్పుకోతగ్గ కంటెంట్ లేకపోయినా సరే.. తెరపై విజయ్ దేవరకొండ – సమంత ల రొమాన్స్ బాగా ఆకట్టుకునింది . మరీ ముఖ్యంగా ఆరాధ్య సాంగ్ లో వీళ్లు రెచ్చిపోయిన పర్ఫామెన్స్ నేటి యువతను ఫిదా చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో విజయ్ సమంత ఫొటోస్ తెగ ట్రెండింగ్ లోకి వచ్చాయి .

అయితే నాగార్జున ఆర్డర్స్ ప్రకారం నాగచైతన్య – అమల – అఖిల్ ఈ సినిమాను ఏఎంబి మాల్ లో కుటుంబ సమేతంగా చూడబోతున్నారట . సమంత పై తమ ఫ్యామిలీకి ఎటువంటి కక్ష లేదని ప్రూవ్ చేయడానికి నాగార్జున ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు నాగచైతన్య లాంటి కష్టం ఏం మగాడికి మొగుడికి రాకూడదని.. మనం ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న మన భార్య మాజీ అయిన తర్వాత వేరే వాడితో రొమాన్స్ చేస్తే అది మనం చూడడం ఇంతకంటే దరిద్రం మరొకటి లేదని కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు..!!