సినీ ఇండస్ట్రీలో ఎడ్జస్ట్మెంట్స్‌.. స్పందించిన స్టార్ బ్యూటీ..

సినిమా రంగంలో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒక రకమైన వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా అడ్జస్ట్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తూంది. అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే హీరోయిన్గా అవకాశాలు వస్తాయని.. వారు ఎదగగలుగుతారని.. ఇప్పటికే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక దీనిపై చాలామంది హీరోయిన్ ప్రస్తావించారు. తాజాగా కేరళ భామ మోడలింగ్ నుంచి సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన మహిమ నంబియార్ కూడా స్పందించింది. 15 ఏళ్ల వయసులోనే 2010లో మాతృభాషలో నటిగా పరిచయం అయ్యింది.

13 ఏళ్ళు వయసులో 2012లో సట్టే చిత్రం ద్వారా హాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇండస్ట్రీకి అడుగుపెట్టి ఇప్పటికి 13 ఏళ్ల అయింది. 2012లో సాట్టే మూవీ ద్వారా కోలివుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి విషయాన్ని అందుకుంది. దీని తర్వాత వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ఇలా మలయాళం లో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలో నటించింది. ప్రస్తుతం రాఘవ లారెన్స్ కు జంటగా చంద్రముఖి 2 లో నటించింది సెప్టెంబర్ 28న ఈ సినిమా ప్రేక్షకులముందుకి రాబోతుంది. అదే విధంగా విజయ్ ఆంటోని సరసన నటించిన రత్తం, మత్తయి మురళీధరన్ బయోపిక్.. (800) సినిమాల్లో కూడా ఈమె నటించింది.

అక్టోబర్ 6న 800 సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రికెటర్‌ మత్తయ్య జీవిత చరిత్రగా రూపొందిన ఈ సినిమాలో ఆయన భార్య మతిమలారుగా నటించడం నాకు చాలా ఆనందంగా ఉందని ఇందులో నా పాత్ర చిన్నదైనా నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. మురళీధరన్‌ ఒక క్రికెటర్‌గానే అందరికీ తెలుసని అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడని.. అలా ఆయనలోని రియల్ కోణాన్ని చూపించే సినిమా 800 అంటు చెప్పుకొచ్చింది.

ఇక చంద్రముఖి 2 లో రాఘవా లారెన్స్ గారి పక్కన చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగించిందని వివరించింది. మలియాళం, తెలుగు భాషల్లో సినీ ప్రయాణం సాగుతున్న ప్రస్తుతానికి మలయాళంలో ఏ సినిమా చేయడం లేదని చెప్పుకొచ్చింది, మహిమ సినీ పరిశ్రమలో మహిళలకు రక్షణ ఉందా అనే ప్రశ్నపై స్పందించింది. ఇతరుల గురించి నేను చెప్పలేను కానీ నాకైతే ఇప్పటివరకు ఎటువంటి చేదు అనుభవాలు ఎదురుగా లేదని వివ‌రించింది.