పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…బండ్లన్న బంపర్ ఆఫర్… అదేంటో తెలుసా…!!

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తన అభిమాన హీరోల సినిమాలు మరోసారి స్క్రీన్ పై చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి, గుడుంబా శంకర్, జల్సా, తొలిప్రేమ రీ రిలీజ్ కాగా.. రీ రిలీజ్ లో రికార్డ్ స్థాయి వసూళ్లను రాబట్టాయి. అయితే.. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ‘ గుడుంబా శంకర్ ‘ రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించాడు.

అదే టైంలో బండ్ల గణేష్ సైతం ‘ గబ్బర్ సింగ్ ‘ రిలీస్ చేస్తామని ప్రకటించడంతో.. అప్పటికే గుడుంబా శంకర్ రీ రిలీజ్ ఉందని రెండు సినిమాలు ఒకేసారి వద్దని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరడంతో.. గణేష్ తన ప్రయత్నంలో వెనక్కి తగ్గాడు. ఇక తాజాగా ‘ తీన్ మార్ ‘ సినిమా రీ రిలీజ్ చేయాలని అభిమానుల నుంచి రిక్వెస్ట్ రాగా.. దీనికి బండ్ల గణేష్ సానుకూలంగా స్పందించాడు.

ఈ మేరకు ” తీన్ మార్ ” సినిమాను బెస్ట్ క్వాలిటీ తో.. సౌండ్స్ అండ్ డైలాగ్స్ కూడా క్లారిటీగా వచ్చేలా రీ రిలీజ్ ప్లాన్ చేశామని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. దీంతో మరోసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. కాగా జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ‘ తీన్ మార్ ‘ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వహించాడు. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి నష్టాలు ఇచ్చింది. మరి రీ రిలీజ్ లో ఎన్ని వసూళ్లు రాబడుతుందో వేచి చూడాల్సి ఉంది.