మెగా ఫ్యామిలీలో మరో మంట వరుణ్- లావణ్యల పెళ్లి క్యాన్సిల్..!

మన తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మెగా ఫ్యామిలీ గురించి ఎలాంటి వార్త బయటకి వ‌చ్చిన నిమిషాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇప్పటికీ ఈ మెగా ఫ్యామిలీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, మరో యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠిల‌ ఎంగేజ్మెంట్ జూన్ 9న ఎంతో గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈ నెల 24న వీరి పెళ్లి ఇటలీలో ఎంతో ఘనంగా జరగబోతుందని ఒక వార్త బయటకు వచ్చింది. అదేవిధంగా పెళ్లి జరిగిన తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్గా రిసెప్షన్ ఇవ్వబోతున్నారు అంటూ టాక్ కూడా వినిపించింది.

అయితే ఇప్పుడు ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. అదేవిధంగా వీరి పెళ్లికి ఇంకా ముహూర్తం ఫిక్స్ కాలేదని తాజా పరిస్థితులను చూస్తుంటే అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గతంలో ఈ నెల 24న వరుణ్ తేజ్ పెళ్లి అదేవిధంగా 25న వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున మూవీ రిలీజ్ అవుతుందనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు గాండీవధారి అర్జున సినిమా విడుదలవుతున్నప్పటికీ పెళ్లి అదే సమయంలో కావటం లేదని అసలు పెళ్లికి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని మెగా కుటుంబం నుంచి సమాచారం.

ఇక ఒకవేళ వీరి పెళ్లి ముహూర్తం గనుక ఫిక్స్ అయి ఉంటే మాత్రం ఇప్పటికే పెళ్లి హడావిడి మొదలయ్యేది. ఈనెల 24న లేదా 25న పెళ్లయితే మాత్రం కేవలం పెళ్లికి 12 రోజులు సమయం మాత్రమే ఉంది. అయితే ఈ సమయానికే మెగా ఫ్యామిలీలో పెళ్లి హడావుడి మొదలయ్యేది కానీ వారి ఫ్యామిలీలో పెళ్లికి సంబంధించిన హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు. దీన్నిబట్టి చూస్తే ఈ నెలలో మాత్రం వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల‌ పెళ్లి జరిగే విధంగా కనిపించడం లేదు. పెళ్లి ఫిక్స్ చేయకపోవడానికి ప్రధాన కారణం నిహారిక విడాకులని తెలుస్తుంది. ఈ విడాకుల స‌మ‌యంలో వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి చేస్తే ఫ్యామిలీలో అంతగా బాగుండదని అందుకే పెళ్లి గురించి ఇంకా డేట్ ఫిక్స్ కాలేదని వార్తలు వినిపిస్తున్నయి, ఈ పెళ్లి ఎప్పుడు అనేది అధికారం గా ప్రకటిస్తే కానీ ఒక క్లారిటీ రాదు.