చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు ఇవే….!!

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న హీరో చిరంజీవి. తెలుగు సినిమాల్లో చిరంజీవి పేరు ఓ భీభత్స‌వం. ఎన్నో సినిమాలు ఆయన రిఫరెన్సులతో ఎందరో హీరోలు, దర్శక నిర్మాతలకు ఉపయోగపడింది.. చిరంజీవి ఫోటో ఒక సీన్లో కనిపించిన, లేదా పేరు వినిపించిన వాళ్ల సినిమాలకు ఓ గౌరవం. ఎన్నో సినిమాలకు ఆయన వాయిస్ ఓవర్ రూపంలో కూడా ప్రత్యక్షంగా సహకారం అందించాడు. హనుమాన్ అనే కార్టూన్ బేస్ట్ సినిమా ఆంజనేయ స్వామి గాధతో తెరకెక్కింది. పిల్లలకు ఆంజనేయుడు కథను అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నంలో ఆ ఆంజనేయ భక్తుడు చిరంజీవి పరోక్షంగా బలమయ్యాడు.

సినిమా ఆద్యంతం చిరంజీవి వాయిస్ ఓవర్‌తో అలరించాడు. అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాలో పెళ్లి ఇతివృత్తాన్ని తనదైన శైలిలో వర్ణిస్తూ గాత్ర దానం చేశాడు చిరు. ఆధ్యాత్మిక భవన అందరికీ చేరువయ్యేలా తెరకెక్కిన జగద్గురు ఆదిశంకరాచార్యులు సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ముఖ్య పాత్రలో వచ్చిన రుద్రమ్మదేవి సినిమాకు కూడా చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. గుంటూరు రోడ్డు మూవీకి కూడా చిరంజీవి వాయిస్ ఓవర్ అందించాడు. సబ్ మెరైన్ ఇదివృత్తంతో తెరకెక్కిన ఘాజీ సినిమాలో చిరంజీవి గంభీరమైన వాయిస్ తో సినిమాను ముందుకు నడిపించాడు.

మోహన్ బాబు హీరోగా వచ్చిన సన్ ఆఫ్ ఇండియా సినిమాకు చిరు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిన బ్రహ్మాస్త్రకు చిరంజీవి గంభీరమైన గాత్రం అందించి సినిమా సక్సెస్ లో భాగమయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ 1,2 భాగాలకు చిరంజీవి వాయిస్ ఓవర్ అందించాడు. ఆ కాలం నాటి పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కలిగించింది. రంగమార్తాండ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు చిరంజీవి అందించిన వాయిస్ ఓవర్ మేకింగ్ వీడియో సంచలనాన్నే రేపింది.

రంగస్థలం కళాకారుల జీవితాన్ని ఉద్దేశిస్తూ చిరంజీవి పలికిన డైలాగులు అద్భుతం అనిపించాయి. టీవీ రంగంలోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశాడు. నీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ లో హూస్ట్ గా తనదైన చలాకీతనం, కామెడీతో ఎపిసోడ్స్ అన్నిటిని రక్తి కట్టించాడు. ఇలా చిరంజీవి తెరపై నటుడు గానే కాకుండా తెర వెనక వాయిస్ ఓవర్ ఇస్తూ అయా సినిమాల్లో భాగమయ్యాడు.