ఒక విరాట్ – ఒక రాజ‌మౌళి – ఒక సుడిగాలి సుధీర్‌.. గోట్ గ్లింప్స్ ( వీడియో )

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని టాలీవుడ్‌కి పరిచయమయ్యాడు సుడిగాలి సుదీర్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన సుధీర్ మొదట మ్యూజిషియన్ గా కెరీర్‌ని ప్రారంభించాడు. తర్వాత జబర్దస్త్ లో చోటు సంపాదించుకొని కంటెస్టెంట్ గా, టీమ్‌లీడర్‌గా, యాంకర్‌గా, హీరోగా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న సుధీర్ గాలోడు సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం గోట్ సినిమాలో నటిస్తున్నాడు. నరేష్ కుప్పిలి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో సుధీర్ హీరోగా బ్యాచిలర్ భామ దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన‌ పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించింది. ఇక నిన్న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ రిలీజ్ చేశారు మూవీ టీమ్‌. టీజర్‌లో హీరో సుధీర్ ఎలివేషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇటీవల కాలంలో గోట్‌ అనే ట్యాగ్‌ ట్విట్టర్ లో బాగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్‌. తమకు నచ్చిన హీరోలు సెలెబ్రిటీలను ఫ్యాన్స్ గోట్ అంటూ ఉంటారు. ఇక సుధీర్ కూడా ఈ సినిమాతో గోట్ అనిపించుకుంటున్నాడు. సుధీర్‌ నటిస్తున్న ఈ గోట్‌ టైటిల్ లో టెన్నిస్ లో గోట్ అయిన రోజర్ ఫెద‌ర్‌ని, క్రికెట్లో గోట్ అయిన విరాట్ కోహ్లీని, అలాగే సినిమాల్లో గోట్ అయిన రాజమౌళిని చూపిస్తూGOA నీ ఫిల్ చేసిన టీమ్ T అనే వర్డ్ కి సుధీర్‌ని యాడ్‌ చేశారు.

ఇక ఇందులో సుధీర్ మాస్‌లుక్ అదిరిపోయింది. లుంగీ కట్టుకుని, సిగరెట్ కాలుస్తూ, క్రికెట్ బ్యాట్ పట్టుకుని ఎవడ్రా నన్ను అంది అనగానే వెనకనుంచి మూడు కార్లు రావడం టీజర్ కే హైలెట్గా నిలిచింది. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ అందించిన‌ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. మొత్తానికి హీరో రోల్‌లో సుదీర్ ఎలివేషన్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ గ్లింప్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ సినిమా రిలీజై ప్రేక్షకుల్లో ఎటువంటి రెస్పాన్స్ వ‌స్తుందో చూడాలి