కొడుకు కంటే చిరంజీవికి ఆ హీరో అంటేనే ఇష్టమా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే..ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీ లోకి ఎంట్రి ఇచ్చిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.. ఎన్నో రకాల సేవలను కూడా అందిస్తూ ఉన్నారు చిరంజీవి. దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజున చిరంజీవి 68వ బర్త్ డే సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Megastar Chiranjeevi Birthday Special Video 2020 | #HBDMegastarChiranjeevi  | Suresh Productions - YouTube

ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు గురించి కూడా వైరల్ గా మారుతున్నాయి. ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటిస్తూనే ఉన్నారు..రాజకీయాల పరంగా ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత వాటి నుంచి బయటపడడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగి ఉన్న వ్యక్తి అంటూ ఎంతోమంది అభిమానులే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం తెలియజేయడం జరిగింది.

Chiranjeevi shares an update about Jr NTR's health status: He and his  family members are doing well | Telugu Movie News - Times of India

ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిరంజీవి.. భోళా శంకర్ సినిమాతో ఫ్లాప్ ని చూశారు.. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం చిరంజీవికి తన కొడుకు కంటే ఒక హీరో చాలా ఇష్టమట.. ఆయన ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్..జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే చాలు స్వయంగా ఫోన్ చేసి జూనియర్ ఎన్టీఆర్ ని అభినందిస్తూ ఉంటారట చిరంజీవి.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే చాలు తన ఇంట్లో షో వేసుకొని మరీ చూసేవారట అంతలా ఎన్టీఆర్ అంటే చిరంజీవికి చాలా ఇష్టమట.