షూటింగ్ సెట్ కి తాగేసి వచ్చి రచ్చ రచ్చ చేసిన శృతిహాసన్.. !!

కోలీవుడ్, టాలీవుడ్ లో లెజెండ్ నటుడుగా పేరు పొందారు హీరో కమలహాసన్..ఇప్పటికీ తన సినిమాలతో అభిమానులను మెప్పిస్తూనే ఉన్నారు. కమలహాసన్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ శృతిహాసన్.. తండ్రికి తగ్గ కూతురుగా నిరూపించుకోని సౌత్లో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. శృతిహాసన్ టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఈ మధ్యన సీనియర్ జూనియర్ అని తేడా లేకుండా అందరీ హీరోల సరసన నటించేందుకు సిద్ధమయ్యింది ఈ ముద్దుగుమ్మ. తమిళంలో కూడా ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించింది శృతిహాసన్.

Shruti Haasan: Sometimes I drink non-alcoholic beers

అయితే ఇంతమంది హీరోల సరసన నటించేందుకు మాత్రం తన తండ్రి పేరును ఉపయోగించుకోలేదు. కేవలం తన టాలెంట్ తోనే ఈ రేంజ్ లోకి శృతిహాసన్ వచ్చిందని చెప్పవచ్చు. అయితే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ శృతిహాసన్ లో కూడా ఉన్నాయట. ఆమెకు పార్టీ కల్చర్ అంటే చాలా ఇష్టమట .. అందుకే ప్రతిరోజు మందు తాగే అలవాటు కూడా ఉండేదని సమాచారం.. ఒకానొక సమయంలో షూటింగ్ కి ఫుల్లుగా తాగేసి వచ్చేదట. ఎంతలా తాగేది అంటే ఆమె నోట్లో నుంచి వచ్చే వాసన చూసి సెట్లో ఉన్న వారందరికీ తాగేసి వచ్చిందని అర్థమయ్యేట.

అలా ఒకసారి స్టార్ హీరో సినిమా షూటింగ్ సమయంలో ఇలాంటి చేదు సంఘటన ఒకటి ఎదురైందని తెలుస్తోంది. దీంతో వెంటనే ఆ హీరో ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయారట. ఈ విషయం శృతిహాసన్ కు అప్పట్లో చాలా ఘోరమైన అవమానంగా భావించవచ్చు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ..ఈ సంఘటన జరిగినప్పటి నుంచి శృతిహాసన్ కాస్త మద్యానికి దూరమైందనే వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి మాత్రమే తాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈమె చేతిలో సలార్ సినిమా ఉన్నది.