40 ఏళ్లు దాటాక నిద్ర ప‌ట్ట‌డం లేదా… ఈ సింపుల్ టిప్స్ మీ కోస‌మే..!

40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. లేదంటే అనేక వ్యాధుల బారిన పడతారు. ముఖ్యంగా ఈ వయసులో కుటుంబ బాధ్యతలు, పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. దీనివల్ల త్వరగా అలిసిపోతారు. ఇలాంటి సమయంలో సరైన నిద్ర చాలా అవసరం. లేదంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ప్రతిరోజు 8 గంటల పాటు నిద్రపోవాలి. అయితే 40 ఏళ్లు వచ్చిన వారికి నిద్ర సరిగ్గా పట్టదు. అయితే 40 ఏళ్లు దాటిన వారికి నిద్ర కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

• గోరివెచ్చటి నీటితో స్నానం చేయాలి. దీనివల్ల ఒంటినొప్పులు, బద్ధకం లాంటి సమస్యలు పోతాయి. మంచి నిద్ర పడుతుంది.

• మనస్సు ప్రశాంతత‌.. 40 సంవత్సరాలు దాటిన వారు ఇటువంటి ఆందోళన పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. టెన్షన్ పెట్టుకోవడం వల్ల అది రాత్రిపూట ప్రభావం చూపిస్తుంది. దీని కారణంగా సరిగ్గా నిద్రపోలేరు. అందువల్ల ఎటువంటి ఆలోచనలు లేకుండా నిద్రపోవాలి.

• ధ్యానం అలవాటు చేసుకోవాలి.. దీనివల్ల టెన్షన్, ఆందోళన దూరం చేయవచ్చు. ‌ ఇందుకోసం యోగా వంటి వ్యాయామాలు చేయాలి. కొన్ని రోజుల సాధన తర్వాత ప్రశాంతంగా నిద్రపోవడం అలవాటు అవుతుంది.

• రాత్రిపూట టీ తాగడం వల్ల నిద్ర పట్టదు. ఒకవేళ మీరు టీ కి బాగా అలవాటు అయితే సాయంత్రం తాగండి. రాత్రిపూట మాత్రం వాటి జోలికి వెళ్ళవద్దు.