అలా అవమానించడంతో.. ఆ స్టార్ హీరో పై అలా రివేంజ్ తీర్చుకున్న సౌందర్య..!!

టాలీవుడ్ లో హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. దాదాపుగా వందకు పైగా సినిమాలలో నటించిన సౌందర్య అచ్చ తెలుగు అమ్మాయిగ నటించి ఎన్నో అవార్డులను రివార్డులను కూడా అందుకుంది. ఇప్పటికి ఈమె సినిమాలు బుల్లితెరపై ప్రసారమయ్యాయి అంటే చాలు మంచి టిఆర్పి రేటింగ్ ని అందుకు ఉంటాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌందర్య ను జూనియర్ సావిత్రి అని పిలుస్తూ ఉండేవారు.. సౌందర్య దాదాపుగా 12 సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో కొనసాగింది.

సౌందర్య కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలలో కూడా నటించింది.ముఖ్యంగా ప్రేమ కథలు లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన సౌందర్య తెలుగు, మలయాళం, కన్నడ ,హిందీ భాషలలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. చనిపోయే వరకు సినిమాలో కొనసాగాలనుకున్న సౌందర్య కళ మధ్యలోనే ఆగిపోయింది. దురదృష్టవశాత్తు సౌందర్య విమాన ప్రమాదంలో మరణించింది. ఎంతోమంది స్టార్ హీరోల నటించిన సౌందర్య సౌత్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో తో మాత్రం అసలు నటించానని మొహం మీద చెప్పిందట..

అయితే అందుకు ప్రధాన కారణం ఒకసారి సౌందర్య ముందు అమ్మాయిల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగిందట.. అయితే ఈ విషయం సౌందర్య గుర్తుపెట్టుకుని ఆ హీరో పైన చాలాసార్లు సీరియస్ అయిందట. అంతే కాకుండా మీలాంటి హీరోల వల్లే మిగతా హీరోలకు కూడా చెడ్డ పేరు వస్తోందని అందరి ముందే తిట్టేసిందట. అలా ఎన్నోసార్లు తనతో నటించే అవకాశం వచ్చిన మొహం మీద నటించాలని చెప్పిందట సౌందర్య. ఇక అప్పటినుంచి సౌందర్యకు దూరంగా ఆ స్టార్ హీరో ఉండేవారట. అలా ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వారికి తగినంత బుద్ధి చెప్పేది అట సౌందర్య. ఇంతకు ఆ హీరో పేరు మాత్రం ఎవరా అంటూ అభిమానులు ఆలోచిస్తున్నారు.