రాజీవ్ గాంధీ మరణానికి ముందు ఆ స్టార్ హీరోయిన్ కి లెటర్..అందులో ఏముందంటే..!?

కాంగ్రెస్ పార్టీలో ఇందిరా గాంధీ మరణం తర్వాత భారతదేశానికి ఆరవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాజీవ్ గాంధీ.. మన భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన వారిలో ఇప్పటివరకు అతి చిన్న ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ రికార్డ్ సృష్టించారు. అలాంటి రాజీవ్ గాంధీ తమిళ తీవ్రవాదుల మానవ బాంబు దాడిలో మరణించారు. అయితే రాజీవ్ గాంధీ చనిపోయే కొన్ని గంటల ముందు అలనాటి ఓ స్టార్ హీరోయిన్ కి ఓ లెటర్ రాశారట. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఆ లెటర్‌లో ఏముంది అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ జయ‌చిత్ర అంటే ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఒకప్పుడు ఈమె తన అంద చందాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈమె తన కెరీర్లో దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. జయ‌చిత్ర అప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభ‌న్‌బాబు, మురళీమోహన్, కృష్ణ వంటి హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించింది. ఈమె సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అత్త, అమ్మ వంటి క్యారెక్టర్ లో కూడా నటించింది.

ఇక ఈమె కేవలం సినిమాలోని కాకుండా రాజకీయాల్లో కూడా గొప్పగా రాణించింది. అదేవిధంగా ఈమె కాంగ్రెస్ పార్టీలో ఎంతో క్రియాశీలకమైన పాత్ర కూడా పోషించింది. అందులో భాగంగా రాజీవ్ గాంధీతో జ‌య‌చిత్రకి ఎంతో మంచి అనుబంధం ఉండేది. అలాంటి సమయంలోనే ఒకరోజు జయచిత్ర- రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్లి మీరు నా సినిమాలు చూసి కచ్చితంగా వాటికి రివ్యూ చెప్పండి సార్ అని అడిగిందట. ఇక దానికి రాజీవ్ గాంధీ పనుల్లో బిజీగా ఉండి సినిమా చూడ్డానికి రాలేకపోవటంతో ఓ చిన్న లెటర్ ద్వారా హీరోయిన్ కి సమాచారం ఇచ్చారట.

ఇక ఆ లెటర్ లో ఏముందంటే.. నాకు ప్రస్తుతం నీ సినిమా చూడటానికి సమయం దొరకలేదు నాకు సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా నీ తర్వాత సినిమా చూస్తాను.. అది ఎలా ఉందో కూడా కచ్చితంగా రివ్యూ ఇస్తాను అని ఆ ఉత్తరంలో రాసి జయచిత్రకు అందేలా చేశారట. ఇక ఈ లేఖ అందుకుని జయచిత్ర చదివిన కొద్దిసేపటికే రాజీవ్ గాంధీ చనిపోయారు అనే మరణ వార్త బయటపడింది.ఇక ఈ విషయం తెలియడంతో జయచిత్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయి కొద్దిసేపు వరకు షాక్ లో ఉండిపోయిందట. ఇక ఈ విషయాన్ని స్వయంగా జయచిత్ర ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు బయటపెట్టింది.