కుప్ప‌కూలిన భారీ భ‌వంతులు… వైర‌ల్ వీడియో ( వీడియో)

ప్ర‌స్తుతం ఇండియాలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కోరుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, నదులు భారీగా ప్రవహిస్తున్నాయి.. ఇప్పటికే ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు సింధూ నది ఎంతో ఉగ్రరూపంలో ప్రవహిస్తూ పలు జిల్లాల్లో విధ్వంసం సృష్టిస్తుంది.

తాజాగా ఆగస్టు 24 అనగా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లోని కూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వానలకు కొండ చర్యలు విరిగి పడటంతో ఇల్లు కూలిపోయాయి. దాంతో ఆ ప్రాంతమంతా ప్రజల ఆర్తనాథాలతో నిండిపోయింది. ఇప్పుడు తాజాగా ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో భారీ వర్షాలు కారణంగా గుట్టలకు దగ్గరగా ఉన్న భారీ భ‌వంతులు సైతం పేక మేడల్లా కోల్పోతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక భ‌వనాలు కోల్పోతున్న సమయంలో వాటి కన్నాకింద‌ ఎవరైనాచిక్కుకుని ఉండవ‌చ్చని అక్కడి స్థానికులు అంచనా వేస్తున్నారు. కాగా భారతీయ వాతావరణ శాఖ గారు ముందుగా అప్రమత్తం చేయటంతో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పింది లేదంటే పెద్ద ఎత్తున‌ ప్రాణానష్టం సంభవించే అవకాశం ఉండేదని అధికారులు చెబుతున్నారు.