పవన్ కళ్యాణ్ పై సీనియర్ నటి షాకింగ్ కామెంట్స్

సీనియర్ నటి రాశి గురించి అందరికి తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రాశి తక్కువ సమయంలోనే స్టార్ట్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లిపందిరి గోగులంలో సీత, శుభాకాంక్షలు, మనసిచ్చి చూడు వంటి చాలా సినిమాల్లో నటించింది. ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో కూడా నటిస్తుంది. అయితే ఇప్పుడు రాశి పవన్ కళ్యాణ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రాశి నటించిన సినిమాల్లో గోగులంలో సీత గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన ఈ సినిమాలో రాశి అద్భుతంగా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక రాశి గ్లామర్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది. అయితే అప్పుడే ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తుండడంతో రాశికి అవకాశాలు తగ్గిపోయాయి. 2003 తరువాత రాశి కెరీర్ డల్ అయిపోయింది. హీరోయిన్ గానే కాదు ఒక సినిమాలో నెగటివ్ రోల్ లో కూడా అద్భుతంగా నటించింది. ఇప్పుడు రాశి జానకి కలగనలేదు వంటి సీరియల్స్ లో నటిస్తోంది. ఈ సీరియల్ లో రాశి పాత్రకి మంచి గుర్తింపు దక్కింది. తాజాగా రాశి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో రాశి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కూతురు పుట్టిన రోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిద్దామని ఆయన నటిస్తున్న సినిమా షూటింగ్ లోకేషన్ కి నేను వెళ్ళాను.. ఇక నేను అపాయింట్మెంట్ తీసుకోలేని కారణంగా నేను నా కారులోనే ఉండి మా డ్రైవర్ తో ఈ విషయాన్ని చెప్పి పంపించాను. పవన్ మాట్లాడుతూ ఇంతసేపు ఆమెను వెయిట్ చేయించావా.. వెంటనే ఇక్కడికి పిలుచుకురా అని నాకు కబురు పెట్టారు.. తర్వాత నేను వెళ్ళగానే నాకు నమస్కరించి గోకులంలో సీత సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేశారు.. నన్ను కారు వరకు తీసుకువెళ్లి మరి ఎక్కించి ఆయన వెళ్లారు.. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంస్కారం అని రాశి ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇప్పుడు రాశి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.