కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన అదా శర్మ.. పిచ్చి బాగా ముదిరిందంటున్న నెటిజ‌న్లు!

టాలెంటెడ్ బ్యూటీ అదా శర్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ది కేరళ స్టోరీ`తో నేష‌న‌ల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న అదా శ‌ర్మ‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది.

త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో పాటు సినిమా అప్డేట్స్ ను పంచుకుంటూ నెట్టింట నిత్యం అదా శ‌ర్మ సంద‌డి చేస్తుంటుంది. అయితే తాజాగా ఓ నెటిజ‌న్ సోష‌ల్ మీడియా ద్వారా ఓ ప్ర‌శ్న వేశారు. `మీరు ఎలాంటి అబ్బాయిని భ‌ర్త‌గా కోరుకుంటున్నారు..?` అంటూ ప్ర‌శ్నించారు. అందుకు అదా శ‌ర్మ త‌న‌కు కాబోయేవాడికి నాలుగు కాళ్ళు ఒక తోక ఉంటే బాగుంటుంది అంటూ ఫ‌న్నీగా ఆన్స‌ర్ ఇచ్చాడు.

దీంతో అదా శ‌ర్మ స‌మాధానంపై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల‌గా స్పందిస్తున్నారు. కొంద‌రు అదా శ‌ర్మ‌కు పిచ్చి బాగా ముదిరిపోయింది.. వెంట‌నే మెంట‌ల్ హాస్ప‌ట‌ల్ లో అడ్మిట్ చేయాలంటూ కామెంట్లు చేస్తున్నారు. మ‌రికొంద‌రు తొంద‌ర్లోనే నువ్వు కోరుకున్న‌వాడు నీసొంతం అవుతాడు అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మొత్తానికి ఫ‌న్నీ ఆన్స‌ర్ తో అదా శ‌ర్మ వార్త‌ల్లో నిలిచింది. కాగా, అదా శ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మే. ఈమె తెలుగులో హార్ట్ అటాక్, సన్నాఫ్ సత్యమూర్తి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, క్ష‌ణం త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. కానీ, ఇవేమి ఇక్క‌డ ఆమె కెరీర్ కు ఉప‌యోగ‌ప‌డ‌లేదు.