తల్లికి రెండో పెళ్లి చేసిన స్టార్ యాక్టర్.. ఐ లవ్ యూ అమ్మ అంటూ..

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్‌కి తమ పిల్లలే దగ్గరుండి రెండో వివాహం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక ఇటీవ‌ల ఓ స్టార్ యాక్ట‌ర్ తన తల్లికి రెండో పెళ్లి చేయడం ద్వారా వార్తల్లో వైరల్ అయ్యాడు. మరాఠీ యాక్టర్ సిద్ధార్థ చందేకర్ సినిమాల ద్వారా ఊహించని రేంజ్ లో పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇతను తనని పెంచి పెద్ద చేసిన తల్లికి రెండో పెళ్లి చేశాడు. ఇటీవల సీట్ ఆఫ్ డ్రీమ్స్ అనే వెబ్ సిరీస్ లో నటించిన సిద్ధార్థ్ ఈ సిరీస్‌తో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.

ఇక తాజాగా తల్లికి రెండో పెళ్లి చేయగా అందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్‌ తల్లి రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. తన తల్లి పెళ్లి గురించి సిద్ధార్థ మాట్లాడుతూ వచ్చాడు. నీ బిడ్డలతో పాటు నీ లైఫ్ కూడా ఇంకా ఉంది.. అంటూ చెప్పుకొచ్చిన సిద్ధార్థ్ స్వతంత్రమైన, అందమైన ఓ ప్రపంచం ఉంది. ఇప్పటివరకు మా కోసం త్యాగం చేసినవి చాలు అంటూ వివ‌రించాడు.

మీ గురించి, మీ కొత్త భాగస్వామి గురించి ఆలోచించే తరణం వచ్చేసిందమ్మా. ఈ విషయంలో నీ పిల్లలు కూడా నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు అంటూ రాసుకొచ్చాడు. నా పెళ్లి మీరు ఎంతో గ్రాండ్గా చేశారు ఇప్పుడు నేను మీ పెళ్లి కూడా అదేవిధంగా గ్రాండ్‌గా చేస్తున్నాను అన్నాడు సిద్ధార్థ్. నా తల్లి రెండో పెళ్లి నేను అత్యంత ఎక్కువగా ఆనందపడే పెళ్లి అంటూ సిద్ధార్థ చెప్పుకొచ్చాడు.. ఐ లవ్ యు అమ్మ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అంటూ సిద్ధార్థ్ ఆ పిక్స్ తో పాటు ట్యాగ్ చేశాడు. సిద్ధార్థ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.