ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

ఏలుతున్న స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?
ఈ పైన కనిపిస్తున్న ఫోటోలో కుర్రాడు ప్రస్తుతం టాలీవుడ్ టాప్ స్టార్ హీరో. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలు అవుతున్నా ఇంకా మంచి క్రేజ్‌తో దూసుకుపోతూ యంగ్ హీరోలకు దీటుగా హిట్లని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అబ్బాయి ఇప్పటికీ అంతే స్మార్ట్ నెస్ తో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకున్న ఈ స్టార్ హీరో ఫోటోలు తన అభిమాని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

ఇప్పటికైనా ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా..? ఎస్ మీరు అనుకున్నది కరెక్టే.. అత‌డు మెగాస్టార్ చిరంజీవి. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో ఆగస్టు 22న పుట్టాడు. చిరంజీవి అసలు పేరు శివశంకర వరప్రసాద్. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్ చదువు పూర్తి చేసుకుని 1976లో ఇండస్ట్రీకి ప్రయాణమయ్యాడు. అక్కడ ఫిలిమ్‌ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకొని ఇటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఫీల్డ్ లోకి వచ్చాడు.

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరో హోదాను దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అదే క్రేజ్‌తో వరుస సినిమాలో నటిస్తూనే ఉన్నాడు. తన సినీ కెరీర్‌లో ఎన్నో విజయాలను, అవార్డులను అందుకున్న చిరంజీవి ఇటీవల భోళా శంకర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాడు. అయినా చిరంజీవి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. ఇక ఇటీవల బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా చిరు నటించబోయే మరో రెండు సినిమాల్లో న్యూ పోస్టర్లు మూవీ టీమ్స్‌ రిలీజ్ చేశారు.