ఇండియాలో ఎక్కువ‌సార్లు రు. 100 కోట్ల కలెక్ష‌న్లు కొల్ల‌గొట్టిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే…!

బాక్స్ ఆఫీస్ దగ్గర రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం మామూలు విషయం కాదు. ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువైపోయి రూ. 100 కోట్లు పెద్ద ఎక్కువగా కనిపించకపోవచ్చు. కానీ ఈ మార్క్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ ప్రత్యేకమే. అలా ఇండియాలో త‌మ సినిమాతో రూ.100 కోట్లు కలెక్షన్‌ ఇచ్చిన స్టార్ హీరోలు ఎవరో ఒక‌సారి చూద్దాం. ఇండియాలో రూ. 100 కోట్ల కలెక్షన్లు రాబట్టిన తొలి హీరో అమిర్ ఖాన్. అతడు నటించిన గజిని సినిమా 2008లో రూ. 100 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఆ ఏడాది క్రిస్మస్ సమయంలో ఈ మూవీ తెరకెక్కింది.

అప్పటికే తమిళ్, తెలుగులో వచ్చిన గజిని సినిమాకి ఇది రీమేక్. అయినా అమిర్ చరిష్మాతో బాలీవుడ్ లో కలెక్షన్ వర్షం కురిపించింది. ఇక బాలీవుడ్ లో మాస్ ఫాలోయింగ్ ఉన్న సల్మాన్ ఖాన్ అందరికంటే ఎక్కువ రూ. 100 కోట్ల కలెక్షన్లు సినిమాలు ఇచ్చాడు. మొత్తంగా సల్మాన్ నటించిన 16 సినిమాలు రూ. 100 కోట్లు కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టడం విశేషం. గత 13 ఏళ్లలో రాధె, అంతిమ్ తప్ప మిగతా అన్ని సినిమాలు రూ. 100 కోట్ల కంటే ఎక్కువే సాధించాయి.

అతడు నటించిన దబంగ్, రెడీ, బాడీగార్డ్, ఎగ్ థా టైగర్, దబంగ్ 2, జై హో, కిక్, భజరంగీ భాయ్జాన్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, సుల్తాన్, ట్యూబ్ లైట్, టైగర్ జిందా హై, రెస్ 3, భారత్, దబంగ్ 3, కీసి కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలు రూ.100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. ఇక సల్మాన్ ఖాన్ తరువాత 15 సినిమాలు తో అక్షయ్ కుమార్ త‌ర్వాత‌ స్థానంలో ఉన్నాడు. వీళ్ళిద్దరి తర్వాత అజయ్ దేవగన్(12), షారుక్ ఖాన్ (8), అమిర్ ఖాన్ (6), హృతిక్ రోష్న్ (6), రణ్వీర్ సింగ్ (5) సినిమాలతో ఉన్నారు.

ఇక టాలీవుడ్‌కి వస్తే ఈ రికార్డ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో ఉంది. మహేష్ నటించిన 6 సినిమాలు రూ. 100 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. మహేష్ నటించిన బిజినెస్ మ్యాన్, భరత్ అనే నేను, శ్రీమంతుడు, సర్కారు వారి పాట, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో రూ. 100 కోట్లు కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టాయి. ఇక మహేష్ బాబు తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ 5 సినిమాలతో ఉన్నారు.