విజ‌య్ దేవ‌ర‌కొండ ఆస్తుల విలువ అన్ని కోట్లా.. రౌడీ బాయ్ మామూలోడు కాదురోయ్‌!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయ్యాడు. అయితే ఆ స్టార్డ‌మ్ అంత సుల‌భంగా ఏమీ రాలేదు. అర్జున్ రెడ్డికి ముందు ఇండ‌స్ట్రీలో విజ‌య్ ఎన్నో క‌ష్టాలు ప‌డ్డాడు. 2011లో నువ్విలా సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. హీరోగా ఆఫ‌ర్లు అందుకునేందుకు ఎంతో శ్ర‌మించాడు. ఫైన‌ల్ గా ఒక్క సినిమా ఆయ‌న కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారింది.

అర్జున్ రెడ్డి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ వెన‌క్కి తిరిగిచూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఆస్తులు కూడా గ‌ట్టిగానే కూడ‌బెట్టాడు. విజ‌య్ దేవ‌ర‌కొండ మొత్తం ఆస్తుల విలువ రూ. 65 కోట్లు ఉంటుంద‌ట‌. సినిమాల ద్వారా కాకుండా అనేక బ్రాండ్స్ కు అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. అలాగే ఈయ‌న‌కు సొంతంగా హైదరాబాద్ సమీపంలో AVD సినిమాస్ అనే మల్టీప్లేక్స్ ఉంది.

`రౌడీ` పేరుతో విజ‌య్ స్టార్ట్ చేసిన క్లాత్ బ్రాండ్ సూప‌ర్ సక్సెస్ అయింది. ఈయన క్లాత్ బ్రాండ్ కి బయట ఎంతో ఆదరణ లభిస్తోంది. `కింగ్ ఆఫ్ ద హిల్స్` అనే నిర్మాణ సంస్థ‌ను స్థాపించి నిర్మాత‌గా కూడా మారాడు. ఇక ఫోర్డ్ మస్టాంగ్, బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ 520, బెంజ్ జిఎల్‌ఎస్ 350, ఆడి క్యూ7 వంటి ల‌గ్జ‌రీ కార్లు విజ‌య్ దేవ‌ర‌కొండ గ్యారేజ్ లో ఉన్నాయి. అన్న‌ట్లు త్వ‌ర‌లోనే విజ‌య్ నుండి `ఖుషి` అనే మూవీ రాబోతోంది. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో స‌మంత హీరోయిన్‌. సెప్టెంబ‌ర్ 1న ఈ ల‌వ్ అండ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల కానుంది.