అలియా భ‌ట్ అలా చేస్తే ర‌ణ‌బీర్ అస్స‌లు ఒప్పుకోడా.. ఇదేం కండీష‌న్ రా బాబు?!

బాలీవుడ్ ల‌వ్లీ క‌పుల్స్ లో ర‌ణ‌బీర్ క‌పూర్‌-అలియా భ‌ట్ జంట ఒక‌టి. చాలా ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట‌.. గ‌త ఏడాది ముంబైలో వివాహం చేసుకున్నారు. అత్యంత వైభ‌వంగా వీరి వివాహం జ‌రిగింది. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ఈ దంప‌తుల‌కు ఓ ముద్దుల పాపాయి జ‌న్మించింది. ఆమెకు రాహా అంటూ నామ‌క‌ర‌ణం చేశారు. పెళ్లై, బిడ్డ పుట్టినా కూడా అలియా భ‌ట్ సినిమాలు ఆప‌లేదు.

ఓవైపు ఫ్యామిలీ లైఫ్ తో పాటు మ‌రోవైపు ప్రొఫెష్న‌ల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ అలియా ముందుకు సాగుతోంది. ఇటీవ‌లె ఈ బ్యూటీ నుంచి `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. అలాగే అలియా భ‌ట్ హాలీవుడ్ డెబ్యూ `హాట్ ఆఫ్ స్టోన్‌` నేరుగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న అలియా భ‌ట్ త‌న భ‌ర్త గురించి ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది.

అదేంటంటే.. అలియా భ‌ట్ లిప్ స్టిక్ వేసుకుంటే ర‌ణ‌బీర్ కు అస్స‌లు న‌చ్చ‌ద‌ట‌. షూటింగ్ లేని సమయంలో బయటకు వెళ్లేటప్పుడు లేదా ఇంట్లో ఉన్న‌ప్పుడు అలియా భ‌ట్‌ లిప్ స్టిక్ వేసుకుంటే ర‌ణ‌బీర్ ఒప్పుకోడ‌ట‌. వెంట‌నే తుడిచేయ‌మ‌ని చెబుతాడ‌ట‌. అలియాపెదాలు లిప్ స్టిక్ లేకుండా సహజంగా ఉంటేనే ర‌ణ‌బీర్ కు నచ్చుతుందట‌. అందుకే లిప్ స్టిక్ వేసుకోవ‌ద్ద‌ని ర‌ణ‌బీర్ కండీస‌న్ పెట్టాడ‌ట‌. తాజాగా అలియా భ‌ట్ ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెల్ల‌డించింది. దీంతో ఆమె వ్యాఖ్య‌లు కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.