దేశంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం అదేనా.. కేజీ 2ల‌క్ష‌లా..?

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో కుంకుమపువ్వు మొదటిది. కేజీ కుంకుమపువ్వు రూ.2 ల‌క్ష‌లు పలుకుతుందంటే దాని ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పువ్వుల తోటలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా జమ్ము కాశ్మీర్ ప్రపంచంలో రెండవ స్థానాన్ని దక్కించుకుంది. ఇక య‌కుంకుమ‌ప‌వ్వు కేస‌రాల‌ను బిర్యానీలు లేదా స్పెషల్ వంటకాలు వండినప్పుడు మంచి రంగు సువాసన కోసం వాడుతూ ఉంటారు.

అలాగే గర్భిణీ స్త్రీలు దీని తీసుకోవడం వల్ల పొట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యము, రంగుతో పుడతారని అంటారు. చాలామంది గర్భిణీలు కుంకుమపువ్వు కేసరాలను పాలలో కలిపి తాగుతారు. పలు రకాల ఔషధాలు తయారీలోనూ కుంకుమపువ్వు ప్రధాన కారకంగా వాడుతారు. చాలా రకాల బ్యూటీ కాస్మెటిక్స్ లో కూడా కుంకుమపువ్వుని వాడుతున్నారు.

ఇలా అన్ని విధాలుగా దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక ఒక కేజీ కేసరలు కావాలంటే 2 లక్షల కుంకుమ పువ్వుల వరకు అవసరం ఉంటుంది. ఈ కారణంతోనే వీటి రేటు కూడా అంతా అధికంగా ఉంటుంది. ప్రస్తుతం దీని వాడకం పెరగడంతో దీని విలువ మరింతగా పెరిగింది.