ఆ హీరోకు బాల‌య్య‌ను ఢీ కొట్టే సీన్ ఉందా…!

నందమూరి నట‌సింహం బాలయ్య హీరోగా అనీల్ రావిపూడి డైరెక్షన్లో భగవంత్‌ కేసరి సినిమా రూపొందుతుంది. ఆఖండ, వీర సింహారెడ్డి తో భారీ బ్లాక్ బస్టర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న బాలయ్య హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా టైటిల్ విభిన్నంగా ఉండటంతో పాటు కాన్సెప్ట్ కూడా భిన్నంగానే ఉండబోతుందని తెలుస్తుంది.

20 ఏళ్ల అమ్మాయికి తండ్రి పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడు. బాలయ్య కూతురుగా శ్రీ లీలా కనిపించబోతుంది. ఇక ఇలాంటి టైంలో ఈ సినిమాకు పోటీగా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ లియో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. భగవంత్‌ కేసరి వర్సెస్ లియో పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇటీవల సంక్రాంతికి విజయ్ సినిమా టాలీవుడ్ లో రిలీజై ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం డిజాస్టర్ వసూళ్లు తెచ్చి పెట్టింది.

ఎంత తమిళ్ సూపర్ స్టార్ అయినా టాలీవుడ్ లో మాత్రం నార్మల్ స్టార్ హీరోనే అన్నట్లుగా అప్పట్లో కామెంట్స్ కూడా వినిపించాయి. అలాంటి టైంలో మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న బాలయ్య.. భగవంత్‌ కేసరి సినిమా కు పోటీగా లియో సినిమా అంటే సాహసం అనే చెప్పాలి. ఇక బాలయ్య భగవంత్ కేసరి సినిమా రిలీజై ఏ కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ఆ రేంజ్‌లో కలెక్షన్లను వసూలు చేస్తుంది..ఇక బాల‌య్య పోటిగా విజ‌య్ నిలవగలడా అనే సందేహం ప్రేక్షకుల్లో మొదలైంది. దీంతో బాలయ్య ఫ్యాన్స్.. బాలయ్యను ఢీకొట్టే అంత సీన్ విజయ్ కి ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.